Pan India Star Heroine: పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటోలు చూశారా..?

కొంతమంది మాత్రమే ఇక్కడ హీరోయిన్ గా క్లిక్ అవుతారు. అలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన వాళ్లే అన్ని సినిమాల్లో హీరోయిన్లుగా నటిస్తూ స్టార్ హీరోల పక్కన రొమాన్స్ చేస్తూ ఉంటారు.

Written By: Gopi, Updated On : April 6, 2024 12:47 pm

Rashmika Mandanna childhood photos

Follow us on

Pan India Star Heroine: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల హవా చాలా ఎక్కువగా నడుస్తుంది. చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే ఇక్కడ హీరోయిన్ గా క్లిక్ అవుతారు. అలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన వాళ్లే అన్ని సినిమాల్లో హీరోయిన్లుగా నటిస్తూ స్టార్ హీరోల పక్కన రొమాన్స్ చేస్తూ ఉంటారు.

ఇక ఇలాంటి క్రమంలోనే కన్నడలో తన మొదటి సినిమాని చేసి ప్రస్తుతం తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలను చేస్తూ బిజియస్ట్ హీరోయిన్ గా గుర్తింపు పొందుతున్న హీరోయిన్ రష్మిక మందాన… ఈమె ఏప్రిల్ 5వ తేదీన కర్ణాటక రాష్ట్రం లోని కోటక్ జిల్లా విరాట్ పేట లో జన్మించింది. ఇక నిన్న ఈమె బర్త్ డే కావడం తో ఆమె చిన్ననాటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె కన్నడ సినిమా ఇండస్ట్రీలో ‘కిరాక్ పార్టీ ‘ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఇక అక్కడ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన తర్వాత తెలుగులో వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన ‘ఛలో ‘ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలందరితో సినిమాలను చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ అయితే సంపాదించుకుంది. ఇక రీసెంట్ గా అనిమల్ సినిమాతో బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుకుంది. ఈ సినిమాలో గీతాంజలి అనే పాత్రలో నటించడమే కాకుండా రన్బీర్ కపూర్ పక్కన చేసిన వాళ్లలో ‘ఆల్ టైం ది బెస్ట్ జోడి’ గా నిలిచింది.

ఇక పుష్ప 2 సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చాటుకోవడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాతో కనక పాన్ ఇండియాలో మరోసారి తన సత్తా చూపించుకోగలిగితే రష్మిక ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఇంకా చాలా సంవత్సరాల పాటు కొనసాగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…