https://oktelugu.com/

weight : శీతాకాలంలో మీ బరువును కాపాడుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవండి..

ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడం లేదా తగ్గడం కామన్ గా చూస్తుంటాం. ఎన్నో సమస్యలకు కారణం ఈ బరువు. కొందరు ఉన్నట్టుండి బరువు పెరుగుతారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 2, 2024 / 01:18 PM IST

    weight

    Follow us on

    weight : ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడం లేదా తగ్గడం కామన్ గా చూస్తుంటాం. ఎన్నో సమస్యలకు కారణం ఈ బరువు. కొందరు ఉన్నట్టుండి బరువు పెరుగుతారు. మరికొందరు బరువు తగ్గుతారు. ఇలా ఒక్కసారిగా ఏ సమస్య వచ్చినా సరే అది ఇబ్బందిని తెస్తుంది. బరువు పెరగడం, తగ్గడం కూడా ఆరోగ్యకరంగా జరగాలి. అనుకోకుండా జరిగితే ఇతర సమస్యలు రావడానికి ఇదొక సంకేతంగా పరిగణించాలి. అయ్యో మరీ ముఖ్యంగా శీతాకాలంలో బరువు నియంత్రణ మన చేతిలో ఉండదు. సో ఈ సమయంలో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శీతాకాలంలో బరువును నిర్వహించడానికి, కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడానికి వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి.

    రోజువారీ వ్యాయామం: శరీరం సమర్థవంతంగా పనిచేయడానికి, కొవ్వును కాల్చడంలో సహాయపడే కార్యకలాపాలను నిర్వహించడానికి తగినంత ఆర్ద్రీకరణ అవసరం. అందుకే ప్రతి రోజు తగినంత వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. వ్యాయామం వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కేవలం బరువు మాత్రమే కాదు ఇతర వ్యాధులు కూడా కంట్రోల్ లో ఉంటాయి. ఉదయం లేదా సాయంత్రం నడక లేదా పరుగు వల్ల అదనపు కేలరీలు బర్న్ అవుతాయి. ఫిట్‌గా ఉండడం, వివిధ ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

    నీరు: నీరు తాగడం కూడా కచ్చితంగా అలవాటు చేసుకోవాలి. దీని వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. నీరు జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. తిన్న ఆహారం జీర్ణం అయితే ఎలాంటి సమస్య ఉండదు. ఇక బాడీని డీహైడ్రేట్ అవకుండా చూసుకోవడం కూడా మీ బాధ్యతనే. సరైన మొత్తంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, నీటిని కలిగి ఉన్న సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి.

    నడక: కచ్చితంగా రోజు నడవాలి. నడక వల్ల ఎన్నో వ్యాధులు పరార్ అవుతాయి. కచ్చితంగా నడకను అలవాటు చేసుకోవాలి. చిన్న చిన్న అవసరాలకు కూడా వెహికిల్స్ ను ఉపయోగించవద్దు.

    యోగా: యోగా వశ్యతను మెరుగుపరచడమే కాకుండా, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మొత్తం ఫిట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. మనస్సును పునరుజ్జీవింపజేయడం ద్వారా మానసిక శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది. యోగా వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దీని కోసం యోగా సెంటర్లను ఎక్కువగా ఆశ్రమించకుండా జస్ట్ సోషల్ మీడియాలో గైడ్ ను ఫాలో అయితే సరిపోతుంది.

    పండ్లు: పండ్లు సహజ చక్కెరలను అందిస్తాయి. ఆరోగ్యకరమైన మూలం సంపూర్ణత్వం భావాలను పెంచడంలో సహాయపడతాయి ఈ పండ్లు. అదే సమయంలో ఆకలిని, మొత్తం క్యాలరీల వినియోగాన్ని కూడా తగ్గిస్తాయి.

    మితమైన ఆహారం: మితంగా ఆహారం తీసుకోండి. అతిగా తినడం, అతిగా అల్పాహారం తీసుకోవడం మానుకోండి. సరైన ఆహారం మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి భాగస్వామ్య నియంత్రణను పాటించండి.