Husband And Wife Relationship: భార్యభర్తల బంధం శాశ్వతమైంది. వివాహానికి ముందు 20 ఏళ్ల తల్లిదండ్రులతో కలిసి ఉంటే.. పెళ్లయిన తరువాత మరణించేవరకు దంపతులు కలిసే ఉంటారు. ఈ క్రమంలో వారి జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని తట్టుకొని ముందుకు సాగాలి. ఒకరిపై ఒకరు ప్రేమతో మెలగాలి. అప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది. అయితే ఈ కాలంలో చాలా మంది భార్యభర్తలు చిన్న చిన్న గొడవలకే విడాకుల వరకు వెళ్తున్నారు. ఎంతో వైభవంగా వివాహం చేసుకున్న వారు.. నెల తిరగకముందే దూరం అవుతున్నారు. భార్యభర్తల్లో ఎవరో ఒకరు ఓర్పుతో ఉండాలి. అప్పుడే ఎదుటివారు కూడా కుదుట పడుతారు. ముఖ్యంగా భార్యతో మంచి భర్త అనిపించుకుంటే ఆమె భర్తను ఎంతో సంతోషంగా ఉంచుతుంది. అందు కోసం ఈ టిప్స్ పాటించాలి.
భర్త అంటే ఏ సతీమణికి అయినా ప్రేమే ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం తనను కాదని పనిచేస్తే అస్సలు ఊరుకోదు. ఉద్యోగం, వ్యాపారం కారణంగా భర్త ఫీల్డ్ పైకి వెళ్తుంటారు. కాని కొంత మంది ఆడవాళ్లు ఇంట్లో ఉండడం వల్ల వారికి బయటి విషయాలు పెద్దగా తెలియవు. ఈ నేపథ్యంలో వారు కొంచెం బెట్టుగా ఉంటారు. ఇలాంటప్పుడు వారి అభిప్రాయాలు గౌరవిస్తూ ఉండాలి. వారి మనసును నొప్పించకుండా వారికేం కావాలో తెలుసుకోవాలి. సంసారం విషయంలో అభిప్రాయాలు తేడాలు ఉంటాయి. కానీ ఒక్కోసారి భార్య అభిప్రాయం కూడా స్వీకరిస్తే ఎల్లప్పుడూ మీతో సంతో షంగా ఉంటుంది.
ఇంటికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఇంట్లో అవసరం లేకున్నా కొన్ని వస్తువులు కావాలని భార్య అడిగితే ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉంటే వారి అభిప్రాయం మేరకు కారును కొనాలి.లేక ఫైనాన్షియల్ గా సాధ్యం కాకపోతే ఆ విషయాన్ని విడమరిచి చెప్పాలి. మెల్లిగా చెబితే ఎవరైనా వింటారు. అందువల్ల ఇంటికి సంబంధించిన వస్తువుల్లో భార్య నిర్ణయానికే వదిలేయాలి. దీంతో మీపై ఆమెకు గౌరవం పెరుగుతుంది.
ఉద్యోగం, వ్యాపారం చేసే చాలా మంది తాము గొప్ప పని చేస్తున్నామని అనుకుంటారు. కానీ అంతకంటే ఎక్కవ పనిని ఇంట్లో ఉండే ఆడవాళ్లు చేస్తారు. దీంతో ఇంట్లోకి వచ్చినప్పు ఆమెకు సాయపడాలి. చేదోడు వాదోడుగా ఉంటే మీతో సంతోషంగా గడిపేందుకు ఇష్టపడుతుంది. పిల్లల విషయంలోనూ కొన్ని నిర్ణయాలు ఆమెకే వదిలేయాలి. ఎందుకంటే ఎక్కువ సేపు పురుషులతో కంటే ఆడవాళ్లతోనే పిల్లలు ఉంటారు. వారి భాగోగుల గురించి మొగవాళ్ల కంటే ఆడవాళ్లకే ఎక్కువగా తెలుస్తాయి. ఇలాంటి కొన్ని టిప్స్ పాటించినట్లయితే మీ భాగస్వామి తప్పకుండా మీమ్మల్ని ఇష్టపడుతుంది.