Ageing Problems: ఆధునిక కాలంలో మనిషి అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. ఆంగ్లేయుల పాలనలో మన దేశంలో మాంసాహారం తినేవారు కాదు. అమావాస్య, పౌర్ణమిలకే సెలవులు ఉండేవి. ఆంగ్లేయులు వచ్చిన తరువాత ఆదివారం సెలవు అని ప్రకటించి ఆ రోజు మాంసాహారం తినేలా మార్చారు. అసలు ఆదివారం రవివారంగా పిలుస్తారు. ఆ రోజు సూర్యుని రోజుగా భావించి మద్యం, మాంసం, మగువ జోలికి వెళ్లకుండా చూసేవారు. కాలక్రమేణా ఆదివారం అంటే ఎంజాయ్ మారుపేరుగా నిలవడం తెలిసిందే. ప్రస్తుత కాలంలో ఆహార నియమాలు పాటించకపోవడంతో అనర్థాలే వస్తున్నాయి. అయినా మనుషుల్లో మార్పులు రావడం లేదు.

మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుందని తెలిసినా వాటిని తినడం లేదు. జిహ్వ చాపల్యం చంపుకోలేక మాంసాహారాలనే అమితంగా తింటున్నారు. ఫలితంగా ఇరవై ఏళ్లకే అరవై ఏళ్లలాగా మారుతున్నారు. సమతుల్య ఆహారం తీసుకుంటే మనకు జబ్బులు రావని తెలిసినా దాన్ని పాటించడం లేదు. దీంతో అనేక రోగాల బారిన పడి ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఆహారాన్ని కాకుండా కృత్రిమంగా తయారు చేసిన వాటికే మొగ్గు చూపుతున్నారు.
డ్రై ఫ్రూట్స్ తో ఎన్నో లాభాలున్న సంగతి తెలిసిందే. కానీ వాటిని తినేందుకు శ్రద్ధ వహించడం లేదు. మాంసం కంటే తక్కువ రేటులో లభిస్తున్నా వాటిని లెక్కలోకి తీసుకోవడం లేదు. డ్రై ఫ్రూట్స్ లో బాదం ఎంతో ముఖ్యమైనవి. రోజుకు రెండు మూడు బాదం పలుకులు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే అతినీలలోహిత కిరణాలు చర్మాన్ని కాపాడతాయి. విటమిన్ ఇ వల్ల ఆరోగ్యానికి ప్రయోజనం కలుగుతుంది. పిస్తా కూడా మనకు ఎంతో లాభం చేకూరేలా చేస్తుంది. ఇందులో ఉండే పాలీఫెనాల్స్, ప్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై మొటిమలు రాకుండా తోడ్పడుతుంది.

డ్రైఫ్రూట్స్ లో ఎక్కువగా ఉపయోగపడేవి ఖర్జూరాలు. వీటిని రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం తినటం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. వీటితో లడ్డూలు కూడా చేసుకోవచ్చు. డ్రైఫ్రూట్స్ తో రుచితో పాటు ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ తో మన ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వయసు మళ్లిన ఛాయలు కూడా కనిపించవు. చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. అందుకే రోజువారీ ఆహారంలో డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే ఎంతో ఉత్తమమని తెలిసినా చాలా మంది పాటించడం లేదు. ఫలితంగా వృద్ధాప్య ఛాయలతో కనిపించడం సాధారణమే. మనం ఆహారంలో మార్పులు చేసుకుంటే మనకు తొందరగా ముసలితనం రాదని తెలుసుకోవాలి.