Rishab Shetty Kantara Collections: OTT కాలంలో ఎంత పెద్ద హీరో సినిమా అయినా కేవలం వీకెండ్ వరుకు ఆడుతుంది..ఇంతకు ముందు లాగా ఫుల్ రన్ రావట్లేదు అని అందరూ అనుకుంటున్న సమయం లో, ఇటీవల విడుదలైన కొన్ని చిత్రాలు అవన్నీ కేవలం అపోహలే అని నిరూపించాయి..అలాంటి చిత్రాలలో ఒకటి ‘కాంతారా’..కర్ణాటక ఫిలిం ఇండస్ట్రీ లో KGF సిరీస్ మరియు జేమ్స్ తర్వాత వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకున్న ఏకైక చిత్రం ఇది.

కేవలం రెండు కోట్ల రూపాయిల గ్రాస్ ఓపెనింగ్స్ తో ప్రారంభమైన ఈ సినిమా వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టడం అంటే మాములు విషయం కాదు..గత కోనేళ్ళుగా సౌత్ లో బడా సూపర్ స్టార్స్ గా కొనసాగుతున్న వారికి కూడా ఈ స్థాయి రన్ రాలేదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..వీకెండ్ లో ఈ సినిమాకి ఎలా అయితే ఫుల్స్ పడుతున్నాయో..పని దినాలలో కూడా అదే స్థాయి హౌస్ ఫుల్స్ ని నమోదు చేసుకుంటూ రికార్డ్స్ ని నెలకొల్పుతుంది ఈ చిత్రం.
కర్ణాటక ప్రాంతం లో అయితే KGF సిరీస్ కి కూడా ఈ రేంజ్ రన్ లేదనే చెప్పాలి..ఇది ఇలా ఉండగా ఈ సినిమాని ఇటీవలే తెలుగు తమిళం మరియు హిందీ బాషలలో విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ప్రాంతీయ బాషలలో కూడా అద్భుతమైన టాక్ ని తెచ్చుకున్న ఈ సినిమా 17 వ రోజున ఆల్ టైం టాప్ 2 ఇండియన్ రికార్డు ని నెలకొల్పింది..17 వ రోజున ఈ సినిమాకి తెలుగు 7 కోట్ల రూపాయిల గ్రాస్, కన్నడ లో 10 కోట్ల రూపాయిల గ్రాస్ మరియు హిందీ లో 6 కోట్ల రూపాయిలు మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా 17 వ రోజున 25 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించి #RRR చిత్రం కి కూడా దక్కని అరుదైన రికార్డు ని నెలకొల్పిన సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఈ సినిమాకి ముందు కేవలం బాహుబలి 2 మాత్రమే ఉంది..అంతే కాకుండా ఈ చిత్రానికి సోమవారం నాడు కూడా అన్ని బాషలలో అద్భుతమైన వసూళ్ల ట్రెండ్ ని కనబరుస్తూ ముందుకు దూసుకుపోతుంది..తెలుగు లో ఈ సినిమాని రెండు కోట్ల రూపాయలకు కొనుగోలు చెయ్యగా రెండు రోజుల్లోనే ఆరు కోట్ల రూపాయిల షేర్ ని సాధించి ఆల్ సెన్సషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది..లాంగ్ రన్ లో ఈ సినిమా తెలుగులో ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.