Diwali Movies 2022: ప్రతి ఏడాది సంక్రాంతి, సమ్మర్ , దసరా మరియు దీపావళి వంటి పండుగలు సినిమా ఇండస్ట్రీ కి మంచి సీసన్ అనే విషయం మన అందరికి తెలిసిందే..ఈ సీసన్ లో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ ఉంటాయి..అలా ఈ దసరా కి మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, అక్కినేని నాగార్జున ఘోస్ట్ మరియు స్వాతి ముత్యం వంటి సినిమాలు విడుదలయ్యాయి..వీటిల్లో ఒక గాడ్ ఫాదర్ సినిమా మినహా మిగిలిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి..ఇక దసరా పండగ అయిపోయిన తర్వాత ఇటీవలే తెలుగులో దబ్ అయినా కన్నడ బ్లాక్ బస్టర్ చిత్రం ‘కాంతారా’ తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది.

ఇక దీపావళి పండుగ సమయం వచ్చేసింది..ఈ దీపావళి కానుకగా రెండు తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు మరియు రెండు డబ్బింగ్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి..అంతే కాకుండా ఆ రోజు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచినా రెండు కొత్త సినిమాలు OTT లో విడుదల కాబోతున్నాయి.
దీపావళి కి థియేటర్స్ లో విడుదల అవుతున్న నాలుగు సినిమాలలో ఒకటి ‘జిన్నా’..మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న ఈ సినిమాలో సన్నీ లియోన్ మరియు పాయల్ రాజ్ పుట్ హీరోయిన్లు గా నటిస్తున్నారు..టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం తో మంచు విష్ణు కి ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం లో ఉంది ట్రేడ్..ఇక ఈ సినిమా తో పాటు యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరో గా నటించిన ‘ఓరి దేవుడా’ అనే చిత్రం కూడా విడుదలకు సిద్ధం గా ఉంది..ఈ చిత్రం ఒక తమిళ సినిమాకి రీమేక్ చిత్రం అని తెలిసినా కూడా విక్టరీ వెంకటేష్ ముఖ్య పాత్ర పోషించడం తో ట్రేడ్ లో కాస్త బజ్ ఏర్పర్చుకుంది..అంతే కాకుండా ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

వీటితో తమిళ స్టార్ హీరోలైన కార్తీ మరియు శివ కార్తికేయన్ లు కూడా ‘సర్దార్’ , ‘ప్రిన్స్’ వంటి చిత్రాలతో మన ముందుకు రాబోతున్నారు..కార్తీ కి తెలుగు లో మంచి క్రేజ్ ఉంది అనే విషయం మన అందరికి తెలిసిందే..అందులోనూ ఈ సినిమాలో కార్తీ ఆరు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడు..దీని పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి..ఇక శివ కార్తికేయన్ కి కూడా తెలుగులో డాక్టర్ మరియు డాన్ వంటి సినిమాలతో మంచి క్రేజ్ రప్పించుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈయన ప్రిన్స్ అనే సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్నాడు..జాతి రత్నాలు వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ కి దర్శకత్వం వహించిన అనుదీప్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించాడు..ట్రైలర్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ తో నిండిపోవడం తో ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి..ఇలా థియేట్రికల్ సినిమాలతో పాటు, భింబిసారా మరియు ఒకే ఒక జీవితం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు OTT లో విడుదల కాబోతున్నాయి..అలా ఈ వారం మూవీ లవర్స్ అందరికి పండగే అని చెప్పొచ్చు.