Five Tips For Sleep: మనుషులు ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. ప్రతి మనిషి ప్రతిరోజు కనీసం 8 గంటల పాటు నిద్ర పోతేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కానీ ఇప్పుడున్న కాలంలో విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు రకరకాల కారణాలతో సరైన నిద్రపోవడం లేదు. దీంతో కొత్త కొత్త రోగాలను అనుభవిస్తున్నారు. అయితే కొన్ని అవసరమైన పనుల వల్ల నిద్రకు భంగం కలిగితే పర్వాలేదు.. కానీ కావాలనే కొందరు రాత్రిళ్ళు మొబైల్ ఫోన్తోనో లేదా ఇతర అలవాట్లతో నిద్రను పాడు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే కొంతమంది చెబుతున్న మాట ఏంటంటే నిద్రపోవడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు అని. అలాంటప్పుడు తొందరగా నిద్ర రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో కావాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఒక మనిషికి ఎనిమిది గంటలు నిద్ర పట్టాలంటే ముందుగా కొన్ని అలవాట్లను మానుకోవాలి. చాలామంది రాత్రి సమయంలో మద్యం తాగి పడుకోవాలని అనుకుంటారు. ఇలా చేస్తే మత్తుగా నిద్ర వస్తుందని అంటారు. కానీ మద్యం లేని రోజుల్లో ఏం చేస్తారు? అలాంటప్పుడు పడుకునే ముందు మద్యం తాగడం మానేయండి. కొన్ని రోజులపాటు కష్టమైన మద్యం మానేసి ధ్యానం చేసి పడుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆటోమేటిగ్గా అలవాటైపోతుంది.
ప్రతిరోజు కచ్చితంగా ఒకే సమయానికి నిద్ర పోవడానికి ప్రయత్నించండి. కొత్తలో కాస్త నిద్ర పట్టకపోయినా రోజు అలవాటుగా మారి అదే సమయానికి నిద్ర వస్తుంది. అయితే ఒక్కోసారి ఒకే సమయానికి పడుకోవడానికి వీలు కాకపోవచ్చు. కానీ ఉదయం మాత్రం ఒకే సమయానికి నిద్రలేచి అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల రాత్రి కొంచెం లేట్ అయినా ఆ తర్వాత వెంటనే నిద్ర వస్తుంది. ఇలా టైం షెడ్యూల్లో పెట్టుకోవడం వల్ల తొందరగా నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది.
బెడ్ ఎక్కిన తర్వాత వెంటనే నిద్ర రావాలంటే గదిలో ఉన్న లైట్లు అన్ని ఆర్పేయాలి. ఎందుకంటే వెలుతురు ఉండడంతో ఆ ప్రభావం కంటిపై పడి వెంటనే కునుకు రావడానికి కష్టంగా మారుతుంది. అందువల్ల మొత్తం కదిలి చీకటిమయం చేసిన తర్వాత అప్పుడు కళ్ళు మసకబారినట్లు అయి నిద్ర రావడానికి అవకాశం ఉంటుంది.
బెడ్ పైకి రాగానే నిద్రపోవడానికి మరో చిట్కా.. బెడ్ ను అందంగా తీర్చిదిద్దడం. కొందరు చిందరవందరగా ఉన్న దానిపైనే నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇలా చేయడం వల్ల అస్సలు నిద్ర పట్టదు. బెడ్ ను శుభ్రంగా తయారు చేసి.. అవసరమైతే సువాసన వచ్చేలా పెర్ఫ్యూమ్ కూడా స్ప్రే చేసుకోవచ్చు. వీలైతే సువాసన కలిగించే పూలను కూడా ఉంచడం వల్ల మనసుకు హాయి కలుగుతుంది. దీంతో ఎటువంటి ఆలోచనలు రాకుండా వెంటనే నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది.
రాత్రి సమయంలో కడుపునిండా అన్నం తింటే నిద్ర వస్తుందని కొందరి భావన. కానీ విధంగా తినడం వల్ల తొందరగా జీర్ణమై ఎలాంటి సమస్య లేకుండా నిద్ర వస్తుంది. అంతేకాకుండా కడుపునిండా అన్నం తినడం వల్ల జీర్ణం కాకపోతే రాత్రి మధ్యలో మెలకువ వస్తుంది. దీంతో సరైన నిద్రపోకుండా ఆందోళనగా ఉంటారు. అందువల్ల మితంగా తినడం వల్ల మంచి నిద్రను పొందుతారు.