Gas Cylinder: సిలిండర్ బుకింగ్‌పై రూ.75 డిస్కౌంట్ పొందే ఛాన్స్.. ఏ విధంగా అంటే?

Gas Cylinder: దేశంలోని పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలలో చాలామందిని కరోనా వల్ల ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయి. మరోవైపు గ్యాస్ సిలిండర్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటం వల్ల ప్రజలపై గతంతో పోలిస్తే భారం పెరుగుతోంది. దేశంలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధర 960 రూపాయలకు అటూఇటుగా ఉంది. అయితే ఇదే సమయంలో బజాజ్ ఫిన్ సర్వ్ యాప్ గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకునే వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ […]

Written By: Navya, Updated On : February 7, 2022 3:10 pm
Follow us on

Gas Cylinder: దేశంలోని పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలలో చాలామందిని కరోనా వల్ల ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయి. మరోవైపు గ్యాస్ సిలిండర్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటం వల్ల ప్రజలపై గతంతో పోలిస్తే భారం పెరుగుతోంది. దేశంలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధర 960 రూపాయలకు అటూఇటుగా ఉంది. అయితే ఇదే సమయంలో బజాజ్ ఫిన్ సర్వ్ యాప్ గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకునే వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది.

బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ ను వినియోగించి గ్యాస్ సిలిండర్లను బుకింగ్ చేసుకునే వాళ్లకు గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై ఏకంగా 10 శాతం డిస్కౌంట్ ను అందిస్తుండటం గమనార్హం. బజాజ్ ఫైనాన్స్ కంపెనీ ఈ యాప్ ను నిర్వహిస్తుండగా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకోవడం ద్వారా గరిష్టంగా 75 రూపాయల వరకు డిస్కౌంట్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఈ ఆఫర్ ను పొందాలని భావించే వినియోగదారులు మొదట బజాజ్ ఫిన్ సర్వ్ యాప్ ను ఓపెన్ చేసి అందులో బిల్స్, రీఛార్జ్ సెక్షన్ లో గ్యాస్ సిలిండర్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత సర్వీస్ ప్రొవైడర్ ను ఎంపిక చేసుకుని మొబైల్ నంబర్ లేదా కన్జూమర్ నంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బుకింగ్ అమౌంట్ ను పే చేయాలి. పేమెంట్ చేసే సమయంలో gas75 అనే ప్రోమోకోడ్ ను వాడటం వల్ల డిస్కౌంట్ ధరకే గ్యాస్ సిలిండర్ ను పొందవచ్చు.

ప్రోమో కోడ్ ను వాడటం ద్వారా 870 రూపాయల నుంచి 880 రూపాయల మధ్యలో గ్యాస్ సిలిండర్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డులను వినియోగించి గ్యాస్ సిలిండర్ ను సులభంగా బుకింగ్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.