Homeలైఫ్ స్టైల్Gas Cylinder: సిలిండర్ బుకింగ్‌పై రూ.75 డిస్కౌంట్ పొందే ఛాన్స్.. ఏ విధంగా అంటే?

Gas Cylinder: సిలిండర్ బుకింగ్‌పై రూ.75 డిస్కౌంట్ పొందే ఛాన్స్.. ఏ విధంగా అంటే?

Gas Cylinder: దేశంలోని పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలలో చాలామందిని కరోనా వల్ల ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయి. మరోవైపు గ్యాస్ సిలిండర్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటం వల్ల ప్రజలపై గతంతో పోలిస్తే భారం పెరుగుతోంది. దేశంలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధర 960 రూపాయలకు అటూఇటుగా ఉంది. అయితే ఇదే సమయంలో బజాజ్ ఫిన్ సర్వ్ యాప్ గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకునే వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది.

బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ ను వినియోగించి గ్యాస్ సిలిండర్లను బుకింగ్ చేసుకునే వాళ్లకు గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై ఏకంగా 10 శాతం డిస్కౌంట్ ను అందిస్తుండటం గమనార్హం. బజాజ్ ఫైనాన్స్ కంపెనీ ఈ యాప్ ను నిర్వహిస్తుండగా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకోవడం ద్వారా గరిష్టంగా 75 రూపాయల వరకు డిస్కౌంట్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఈ ఆఫర్ ను పొందాలని భావించే వినియోగదారులు మొదట బజాజ్ ఫిన్ సర్వ్ యాప్ ను ఓపెన్ చేసి అందులో బిల్స్, రీఛార్జ్ సెక్షన్ లో గ్యాస్ సిలిండర్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత సర్వీస్ ప్రొవైడర్ ను ఎంపిక చేసుకుని మొబైల్ నంబర్ లేదా కన్జూమర్ నంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బుకింగ్ అమౌంట్ ను పే చేయాలి. పేమెంట్ చేసే సమయంలో gas75 అనే ప్రోమోకోడ్ ను వాడటం వల్ల డిస్కౌంట్ ధరకే గ్యాస్ సిలిండర్ ను పొందవచ్చు.

ప్రోమో కోడ్ ను వాడటం ద్వారా 870 రూపాయల నుంచి 880 రూపాయల మధ్యలో గ్యాస్ సిలిండర్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డులను వినియోగించి గ్యాస్ సిలిండర్ ను సులభంగా బుకింగ్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

2 COMMENTS

  1. […] Vishnu Manchu: జగన్ సినిమా ఇండస్ట్రీని దెబ్బ తీస్తున్నా.. థియేటర్ల పై ఉక్కుపాదం మోపుతున్నా.. నిర్మాతలు ఎంత ఇబ్బంది పడినా.. మంచు విష్ణు మాత్రం ఇన్నాళ్లు ఎక్కడా కనిపించలేదు. అయితే, రేపు ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి, సినీ ప్రముఖులు భేటీ అవనుంది. అలాగే ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంలో చిరంజీవి సీఎం జగన్‌తో ఇప్పటికే భేటీ అయ్యాడు. భేటీ పై ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. […]

  2. […] F3 Movie: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎఫ్ 3’ చిత్రం ఏప్రిల్ 29న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్‌అయింది. మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అందులో భాగంగానే, ఈ రోజు చిత్రంలోని మొదటి పాటను విడుదల చేశారు. సంగీత సంచలనం దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన లబ్ డబ్ లబ్ డబ్బు అంటూ సాగిన ఈ పాట డబ్బు గొప్పతనాన్ని తెలియజేస్తుంది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular