Five Types Of Plants : ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు పెద్దలు. అయితే ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం కావడంతో ప్రతి ఒక్కరూ దాదాపు అనారోగ్యాల పాలవుతున్నారు. అయితే అనారోగ్యాలు బారిన పడడానికి చెట్టు నరకడమే అని కొందరు పర్యావరణ విత్తనాలు అంటున్నారు. ఎందుకంటే చెట్టు లేకపోవడం వల్ల స్వచ్ఛమైన గాలి రావడం లేదు. దీంతో గాలి కలుషితంగా మారిపోతుంది. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో చెట్టు లేకపోవడం వల్ల వాతావరణ పొల్యూషన్ గా మారిపోతుంది. ఇలాంటి సమయంలో ఇంట్లో కొన్ని మొక్కలు నాటుకోవాలని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. అయితే ఏది పడితే అది కాకుండా స్వచ్ఛమైన ఖాళీ ఇచ్చే మొక్కలు మాత్రమే పెంచుకోవాలని చెబుతున్నారు. ఈ మొక్కలను పెంచుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా స్వచ్ఛమైన వాతావరణ ఉంటుందని అంటున్నారు. ఇంతకు ఇంట్లో ఏ రకమైన మొక్కలు పెంచుకోవాలి?
Also Read : ఇంట్లో మొక్కలను పెంచుతున్నారా? వీటిని తప్పకుండా ఉంచండి..
కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎంతో శ్రేష్టమని అంటున్నారు. ఈ మొక్క ఇంట్లో ఉండడం వల్ల గాలిని శుద్ధి చేస్తుంది. దీంతో చర్మంతో పాటు జుట్టు సంరక్షణగా ఉంటుంది. అలాగే ఏ గదిలోనైతే ఈ మొక్క ఉంటుందో ఆ గది లో ఉండడంవల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెంపొందుతాయి.
ప్రతి ఒక్క ఇంట్లో తులసి మొక్క తప్పనిసరిగా ఉండాలని చాలామంది అంటూ ఉంటారు. తులసి మొక్క ఇంట్లో ఉండడం వల్ల ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది. అంతేకాకుండా ఇది ఇంట్లో ఉండడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. తులసి మొక్కలో యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి. దీని రసం తాగడం వల్ల దగ్గు, జ్వరం, జలుబు వంటివి తగ్గుతాయి. అయితే ఇది ఇంట్లో ఉండడంవల్ల దీని ద్వారా వచ్చే గాలితో ఆ సమస్య రాకుండా ఉంటుంది. అయితే తులసి మొక్కను ఇంట్లో కాకుండా ఇంటి ఆవరణలో పెంచుకోవడం వల్ల ఎంతో మంచిది అని అంటున్నారు.
వె దురు మొక్క అనగానే ఎక్కువగా అడవిలో పెరుగుతుంది కదా అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఇంట్లో పెంచుకునే వెదురు మొక్కలు కూడా ఉంటున్నాయి. ఇది తక్కువ ఎత్తులో పెరిగి ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి ఇంట్లో ఉండడం వల్ల సంపాద పెరుగుతుందని భావిస్తారు. అంతేకాకుండా వీటికి సూర్య రష్మి కూడా ఎక్కువగా అవసరం ఉండదు. ఇది ఇంట్లో ఉండడంవల్ల కుటుంబ సభ్యులు అంతా ఆరోగ్యంగా ఉంటారు.
చాలామంది ఇళ్లలో మనీ ప్లాంట్ మొక్క కనిపిస్తూ ఉంటుంది. నీ మొక్క ఇంట్లో ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది. అయితే ఇది పెంచడానికి మట్టి అవసరం లేదు. ఒక పాత్రలో నీరు పోసి అందులో దీనిని వేయడం వల్ల ఇది పెరుగుతుంది. దీని ద్వారా వచ్చే గాలి స్వచ్చంగా ఉంటుంది. ఇది ఇంట్లో ఉండడం వల్ల అందరూ ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
తిప్పతీగ మొక్క ఇంట్లో ఉండడం వల్ల ఇమ్యూనిటీ జరుగుతుంది. మనసులు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. దీని నుండి వెలువడే గాలి ద్వారా అనుకోకుండానే మనుషులకు శక్తి వస్తుంది. అందువల్ల ఈ మొక్కను ఇంట్లో ఉంచుకోవాలని చెబుతున్నారు.
Also Read : ఈ మొక్కలు మీ పెరటిలో నాటారా.. ఇక మీ జీవితం నాశనం కావడం ఖాయం