PR Sundar: చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. కర్మ ఫలితాన్ని మోయాల్సిందే. ఇప్పుడు ఇది ఫైనాన్షియల్ ఇన్ ఫ్లూ య న్స ర్ (ఫిన్ ప్లు యే న్స ర్) పిఆర్ సుందర్ కి అనుభవంలోకి వచ్చింది. మార్కెట్ రెగ్యులేటరీ నుంచి అవసరమైన రిజిస్ట్రేషన్ లేకుండానే ఇన్వెస్ట్మెంట్ సలహాలపై ఫిర్యాదులు, భారీగా ఫీజు దండుకోవడంతో సెబీ సుందర్ పై కొరడా ఝులిపించింది. ఆరు కోట్ల జరిమానా కూడా విధించింది. దీంతోపాటు ఒక సంవత్సరం సెక్యూరిటీల లావాదేవీలు నిర్వహించకుండా నిషేధం విధించింది. ” చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే సుందర్.. కర్మ ఫలితాన్ని ఎవడైనా మోయాల్సిందే. సెబి నీకు తగిన శాస్తి చేసిందంటూ” నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
తప్పుడు ట్రేడింగ్ కాల్స్
స్టాక్ మార్కెట్ అనేది కేసినో లాంటిది. ఇప్పుడు ఏ కంపెనీ షేర్లు పైకి లేస్తాయో, ఎప్పుడు ఏ కంపెనీ షేర్లు పతనమవుతాయో ఎవరికీ తెలియదు. అయితే ఇలాంటి మాయాజాలమైన స్టాక్ ఎక్స్చేంజిలో పిఆర్ సుందర్ తప్పుడు ట్రేడింగ్ కాల్స్ ఇచ్చాడు. అంతేకాదు ఇన్వెస్టర్ల నుంచి భారీగా ఫీజులు దండుకున్నాడు. ఇలా అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో 30 కోట్ల విలువైన ఇల్లు నిర్మించాడు. రోల్స్ రాయిస్ కారు కొన్నాడు. ల్యాండ్ రోవర్ కంపెనీకి సంబంధించి విలాసవంతమైన కారు కూడా ఇటీవల కొన్నాడు. ఇవే కాకుండా ఇంకా కొన్ని వందల కోట్ల విలువైన ఆస్తులు సంపాదించాడు.
సుందర్ స్టాక్ అడ్వైజరీ తో పాటు టెలిగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ ద్వారా రోజువారి కాల్స్, లావాదేవీల పై సలహాలు ఇస్తారు. ఎందుకు గానూ “లేజర్ పే” లింకు ద్వారా చెల్లింపులు స్వీకరిస్తారు. రేజర్ పే, డైరెక్ట్ క్రెడిట్ ద్వారా మాన్సన్ బ్యాంకు ఖాతాలో 4.36 కోట్లు, ఇతర నగదు 23.5 లక్షలకు పైగా వసూలు చేశాడు. అయితే ఈ వివరాలను సెబీ తన సెటిల్మెంట్ ఆర్డర్లో పేర్కొంది. ఇక దీనికి పరిహారంగా 6 కోట్లు చెల్లించడంతోపాటు, సెటిల్మెంట్ ఆర్డర్ పాస్ అయినప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు సెక్యూరిటీలు కొనడం, విక్రయించడం లేదా ఇతర లావాదేవీలు చేయకుండా కట్టడి చేసింది.
అయితే సుందర్ పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సెబీ నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై నిజ నిర్ధారణ చేసేందుకు హైపవర్డ్ అడ్వైజరి కమిటీని 2023 ఫిబ్రవరి 22న నియమించింది.. అనంతరం ఏప్రిల్ 3న సెటిల్మెంట్ రెగ్యులేషన్స్ లోని రెగ్యులేషన్ 15 ప్రకారం హోల్ టైం మెంబర్స్ ప్యానెల్ సిఫారసును ఆమోదించింది. ఏప్రిల్ 6న ఈ విషయాన్ని దరఖాస్తుదారులకు తెలియజేసింది.. దీని ప్రకారం సెటిల్మెంట్ మొత్తం చెల్లించి, ఆర్జించిన లాభంతో సహా జమ చేయాలని ఆదేశించడంతో పి ఆర్ సుందర్ దీనికి ఒప్పుకున్నాడు. అతడికి సంబంధించిన మూడు సంస్థలు ఒక్కొక్కటి 15.60 చొప్పున మొత్తం 46.80 లక్షలను చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 1 2020 నుంచి ఫిబ్రవరి 2023 వరకు సపరించిన సెటిల్మెంట్ నిబంధనలను సమర్పించే తేదీ వరకు సంవత్సరానికి 12 శాతం వడ్డీతో సహా 6,07,69,863 డిస్ గోర్జ్ మెంట్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కాగా పీఆర్ సుందర్, అతడి కంపెనీ మాన్సన్ కన్సల్టింగ్, కంపెనీ_ కో ప్రమోటర్ మంగయార్ కరసి సుందర్ కు సెబీ గతంలోనే సెబీ షోకాజ్ నోటీసులు పంపింది. అయితే దీనిపై తాజాగా చర్యలు తీసుకుంది. ప్రధానంగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, మ్యూచ్ వల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ పై ప్రధానంగా ఫేస్ బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్ లాంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ లో దారులకు సలహాలు ఇచ్చే వారిని ఫిన్ ప్లూయరెన్స్ అంటారు. దీనికి ఫీజు కూడా వసూలు చేస్తారు. అయితే ఇలాంటి సేవలకు గానూ సంబంధిత వ్యక్తులకు సెబీ రిజిస్ట్రేషన్, అనుమతి తప్పనిసరిగా ఉండాలి.

He jumped to
crypto crypto bois watch out for this man, he has entered ur
territory in rented Rolls Royce #Crypto
#prsundar
pic.twitter.com/scWAvmRdzU

Priyanka Gowda (@Priyankagowda22) May
26, 2023