Ram Charan – Nikhil Siddharth: రామ్ చరణ్ నిర్మాణం లో నిఖిల్ హీరో గా ‘ఇండియా గేట్’.. రేపే ప్రారంభం!

ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్కేల్ లో తెరకెక్కిస్తున్నామని, V మెగా పిక్చర్స్ తో పాటుగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం కానుంది. ఈ సందర్భం గా ఒక పోస్టర్ హీరో బోట్ ని నడుపుతున్న స్టిల్ తో విడుదల చేసారు.

Written By: Vicky, Updated On : May 27, 2023 8:08 pm

Ram Charan - Nikhil Siddharth

Follow us on

Ram Charan – Nikhil Siddharth: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యూవీ క్రియేషన్స్ విక్రమ్ కలిసి V మెగా పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి సరికొత్త టాలెంట్ మరియు కంటెంట్ ని ప్రోత్సహిస్తూ సినిమాలను నిమించబోతున్నారు. అందులో మొదటి చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు ఉదయం 11:11 నిమిషాలకు తెలియచేయనున్నారు.

ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్కేల్ లో తెరకెక్కిస్తున్నామని, V మెగా పిక్చర్స్ తో పాటుగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం కానుంది. ఈ సందర్భం గా ఒక పోస్టర్ హీరో బోట్ ని నడుపుతున్న స్టిల్ తో విడుదల చేసారు. హీరో ముఖం చూపించకుండా కేవలం చెయ్యి మాత్రమే చూపించారు. పూర్తి వివరాలు రేపే తెలియచేస్తారట.అయితే సోషల్ మీడియా కారణంగా ముందుగానే అన్నీ లీక్ అయిపోతున్నాయి.

ఈ సినిమాలో హీరో మరెవరో కాదు, ప్రతీ చిత్రం తో తనలోని కొత్త కోణాన్ని ఆవిషరిస్తూ సరికొత్త సబ్జక్ట్స్ తో అలరిస్తున్న నిఖిల్.ప్రస్తుతం ఆయన ‘స్పై’ అనే చిత్రం లో నటిస్తున్నాడు, షూటింగ్ కార్యక్రమాలు జెట్ స్పీడ్ లో జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలోనే విడుదల కాబోతుంది.ఈ సినిమా పూర్తి కాకముందే రామ్ చరణ్ నిర్మాణం లో రాబోతున్న ‘ఇండియా గేట్’ లో హీరో గా నటిస్తున్నాడు.

ఇప్పటికే ఆయన పాన్ ఇండియా లెవెల్ లో ‘కార్తికేయ 2 ‘ ద్వారా సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఇండియా గేట్ చిత్రం ద్వారా మరో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ అక్కినేని అఖిల్ తో కూడా ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు కూడా త్వరలోనే తెలియచెయ్యబోతున్నారు.