Phone Hacking: సింపుల్ గా ఈ ట్రిక్ తో మీ ఫోన్ హ్యాక్ అయ్యిందో లేదో ఇలా తెలుసుకోండి..

మన ఫోన్ ను వాడుతున్న సమయంలో మన డేటా అంతా ఇతరుల చేతుల్లోకి వెళ్లే రోజులివి. అయితే అందరి డేటాను దొంగిలించకపోయినా కొందరు ముఖ్యమైన వారి పర్సనల్ డేటాను కొందరు హ్యాక్ చేస్తున్నారు. ఇలా వివరాలు సేకరించి బ్యాంకు అకౌంట్లు ఇతర ఫైనాన్స్ విషయాలను సేకరిస్తున్నారు.

Written By: Chai Muchhata, Updated On : August 12, 2023 5:28 pm

Phone Hacking

Follow us on

Phone Hacking: నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటోంది. మనకు కావాల్సిన సదుపాయలతో పాటు ఫోన్ ఉపాధిని కూడా అందిస్తోంది. దీంతో నిత్యం మొబైల్ కే అడిక్ట్ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు.మొబైల్ ఫోన్ ను ఎంత మంచిగా వాడితే అంత ప్రయోజనకరంగా ఉంటుంది. లేకపోతే దుష్పరిణామాలు ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫోన్లకు హ్యాకర్ల బెడత తీవ్రంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఇతరుల గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహంతో మొబైల్ ను హ్యాక్ చేస్తున్నారు. అయితే మన మొబైల్ ను హ్యాక్ చేశారని ఎలా గుర్తించాలి? దాని కోసం ఏం చేయాలి?

మన ఫోన్ ను వాడుతున్న సమయంలో మన డేటా అంతా ఇతరుల చేతుల్లోకి వెళ్లే రోజులివి. అయితే అందరి డేటాను దొంగిలించకపోయినా కొందరు ముఖ్యమైన వారి పర్సనల్ డేటాను కొందరు హ్యాక్ చేస్తున్నారు. ఇలా వివరాలు సేకరించి బ్యాంకు అకౌంట్లు ఇతర ఫైనాన్స్ విషయాలను సేకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన ఫోన్ ను జాగ్రత్తగా వాడాల్సిన అవసరం ఉంది. అయితే ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా దొంగల బెడత తప్పకుండా ఉంటుంది. ఈ నేపథ్యంలో మన ఫోన్ ఇప్పటికే హ్యాక్ అయిందా? లేదా? అనేది ఈ చిన్న ట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చు.

ముందు మీ మొబైల్ డయల్ ప్యాడ్ ఓపెన్ చేయండి. అందులో స్టార్ బటన్ ప్రెస్ చేసి ఆ తరువాత యాష్ 67 అని రాసి మరోసారి యాష్ ప్రెస్ (*#67#) చేయండి. ఇది డయల్ చేసిన తరువాత మీకో మెసేజ్ వస్తుంది. ఇందులో Not Forwered అని మెసేజ్ రావాలి. ఇలా వస్తే మీ ఫోన్ హ్యాక్ కాలేదని అర్థం. ఇదే కాకుండా *#21# డయల్ చేసి కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా ఆప్షన్ Forwered అని వస్తే దానిని క్యాన్సిల్ చేసుకోవచ్చు. అదెలా అంటే?

మీకు వచ్చిన మెసేజ్ లో ఏదైనా Forwered అవుతుందని మీరు గ్రహిస్తే ##002# కొట్టి కాల్ చేయండి. ఎరాజ్ వాజ్ సక్సెస్ ఫుల్ అని వస్తుంది. అంటే ఇక నుంచి మీ ఫోన్ ఎవరూ హ్యాక్ చేయలేరని తెలుస్తోంది. అయితే దీనిపై కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చాలా మంది దీనిని ట్రై చేయగా సక్సెస్ అవుతుంది.మరికొందరికి మాత్రం వేరే మెసేజ్ లు వస్తున్నాయి. అయితే ఓవరాల్ గా మాత్రం ఇది హ్యాక్ ను కనిపెట్టే ఆప్షన్షేనా అనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఓ యువకుడు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.