Money Savings: డబ్బు.. ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తున్నది ఇదే. దేశాలు మారుతుంటే కరెన్సీ స్వరూపం మాత్రమే మారుతుంది. కరెన్సీ ఇచ్చే విలువ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. కర్ర ఉన్నోడిదే బర్రె అన్నట్టుగా.. చేతిలో డబ్బు ఉన్నవాడిదే ఈ ప్రపంచం. డబ్బు చేతిలో ఉంటే ప్రపంచాన్ని ఎలాగైనా మార్చవచ్చు. ఏ రూపంలోనైనా సరే చుట్టూ తిప్పుకోవచ్చు.
సమాజంలో ఆర్థికంగా స్థితిమంతులు కావాలంటే ఖచ్చితంగా చేతిలో డబ్బు ఉండాలి. డబ్బు చేతిలో ఉండాలంటే ఎలా ఆదా చేయాలో తెలిసి ఉండాలి. అలా జరగాలంటే సంపాదించిన డబ్బులో సింహభాగం పొదుపు చేయాలి. అయితే ఈ సిద్ధాంతం సరైనది కాదని.. డబ్బు ను ఆదా చేయడం కంటే ఖర్చు పెట్టడమే ఉత్తమం అని రిచ్ డాడ్.. పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియో సాగి చెబుతున్నారు.
“పాఠశాలకు చదువుకోడానికి వెళ్తాం. చదువుకున్న తర్వాత ఉద్యోగం చేస్తాం. ఉద్యోగం చేయాలంటే స్కిల్స్ ముఖ్యం. చదువు ద్వారా అవి వస్తాయి అంటే నేను నమ్మను. ఉద్యోగ సంపాదించడానికి పాఠశాలకు ఎందుకు వెళ్లాలి” అంటూ రాబర్ట్ కియాసాకి ట్వీట్ చేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చకు దారితీస్తోంది.
వాస్తవానికి ఒకప్పుడు బాగా చదువుకుంటే ఉన్నతమైన ఉద్యోగాలు వచ్చేవి. ఉద్యోగుల ద్వారా జీవితం మొత్తం భద్రత ఉంటుందని చాలామంది నమ్మేవారు. ఇప్పుడు ఎంత పెద్ద స్థాయి కంపెనీలో ఉద్యోగం తెచ్చుకున్నప్పటికీ.. భద్రత అనేది లేకుండా పోయింది. 2025 లో యుపిఎస్ అనే కంపెనీ 48,000 మందిని తొలగించింది. అమెజాన్ 30,000, ఇంటెల్ 20000, వీరి జోన్ 15000, మైక్రోసాఫ్ట్ 6000, సేల్స్ ఫోర్స్ 4000, జిఎం 3420, ఐబీఎం 2700, వాల్ మార్ట్ 1500 ఉద్యోగాలు తొలగించింది.
“ఎంప్లాయిస్ ను బయటికి పంపించిన వాటిల్లో ఎక్కువగా పెద్ద స్థాయి సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి కంపెనీలు ఉద్యోగ భద్రతను కల్పించడంలో విఫలమవుతున్నాయి. ఇలాంటి సమయంలోనే ఆర్థిక పరిజ్ఞానం పెంచుకొని.. సంపాదించిన డబ్బును ఆదా చేయకుండా.. విలువైన లోహాల మీద పెట్టుబడి పెడితే ధనవంతులను చేస్తాయని” కియాసాకి అభిప్రాయపడుతున్నారు.
“ఎంత పెద్ద ప్రైవేట్ కంపెనీ అయినా సరే ఉద్యోగ భద్రత కల్పించడం నూటికి నూరు శాతం గ్యారెంటీ ఇవ్వదు. డబ్బులు కనుక బ్యాంకులో ఉంచితే కొన్ని సందర్భాలలో విలువ తగ్గిపోతుంది. అలాంటప్పుడు డబ్బులు నేరుగా ఆదా చేయకుండా.. విలువ పెంచే వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగించాలి. వాస్తవానికి ఉద్యోగ సాధించడానికి పాఠశాలకు వెళ్లడం అనేది ఒక రకమైన పాత ఆలోచన. దానికి అర్థం చదువు వ్యర్ధమని కాదు.. ధనవంతులుగా మారడానికి చదువు అవసరం కొంతవరకు అని మాత్రమే చెప్పడమని” కియాసాకి అభిప్రాయపడ్డారు.