Homeక్రీడలుDr. John Watts: ఆర్చరీ నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన ప్రముఖ తెలుగు...

Dr. John Watts: ఆర్చరీ నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన ప్రముఖ తెలుగు డాక్టర్ !

Dr. John Watts: ఆర్చరీ నేషనల్ గేమ్స్ లో ప్రముఖ తెలుగు డాక్టర్ బంగారు పతకం సాధించారు. కేరళలోని తిరువంతపురంలో జరిగిన నేషనల్ మాస్టర్ గేమ్స్ లో డాక్టర్ : జాన్ వాట్స్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. హైదరాబాద్ లోనే టాప్ హెయిర్ ట్రాన్స్‌ ప్లాంట్ సర్జన్‌ గా డాక్టర్ : జాన్ వాట్స్ ఎన్నో అవార్డులను & రివార్డులను పొందారు. ఇప్పుడు ఆర్చరీలో కూడా అద్భుతమైన ప్రతిభను కనబర్చడం విశేషం. ఆర్చరీలో సాధించిన ఈ బంగారు పతాకంతో జాన్ వాట్స్ బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Dr. John Watts
Dr. John Watts

ధనుర్విద్య ( Archery), అతిప్రాచీన క్రీడ. పురాణ యుగపు కథానాయకుల నుండీ, ప్రతి నాయకులూ, రాజాధి రాజులు మొదలు, సామాన్య పౌరులూ, అందరూ విలువిద్యను నేర్చిన వారే, అందరికీ నేర్పిన వారే. ద్రుపదుని కొలువులో మత్స్య యంత్రాన్ని కొట్టిన అర్జునుడు, శివధనుస్సును విరిచి సీతను పెళ్ళాడిన రాముడూ విశ్వామిత్రుని వద్ద విలువిద్యను నేర్చిన వారే. విలువిద్య లోనే గురువును మించిన శిష్యుడనిపించు కున్నాడు ఏకలవ్యుడు. ఒక్క మాటలో చెప్పాలంటే మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ ప్రభుత్వాన్ని తన విల్లుతో, విల్లంబుల సైన్యంతో, గడగడ లాడించి తుపాకులకు ఎదురు నిల్చి, విల్లుతో ఎందరినో హత మార్చాడు. అంత గొప్ప చరిత్ర ఉంది విలువిద్యకి.

Also Read: CM KCR Delhi Tour: వెన్నులో వణుకు.. కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌ అందేకేనా? ప్రధానిని కలువ కూడదనే ఆకస్మిక యాత్ర!!

Dr. John Watts
Dr. John Watts

ఐతే, ప్రతి క్షణం బిజీగా ఉండే వైద్య వృత్తిలో ఉండి కూడా.. ఈ విలు విద్యలో జాన్ వాట్స్ ఒక తెలుగు వ్యక్తిగా ఇలా నేషనల్ మాస్టర్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం తెలుగు ప్రజలకే గర్వకారణం. ‘డాక్టర్ : జాన్ వాట్స్’ 1900 వందలకు పైగా హెయిర్ అండ్ బియర్డ్ (గడ్డం) ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలను వందశాతం సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన సీనియర్ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జిన్. హైదరాబాద్ లోనే టాప్ హెయిర్ ట్రాన్స్‌ ప్లాంట్ సర్జన్‌ గా ఆయనకు గొప్ప పేరు ఉంది.

Dr. John Watts
Dr. John Watts

అయినా, తన పేషంట్స్ కళ్ళల్లో ఆనందాన్ని చూడటమే తనకు నిజమైన అవార్డు & రివార్డు అని జాన్ వాట్స్’ నమ్ముతారు. వేల మంది పేషంట్ల జీవితాల్లో వెలుగులు నింపిన జాన్ వాట్స్, ఇప్పుడు ఆర్చరీ క్రీడా అభిమానుల హృదయాల్లో కూడా ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఆర్చరీ క్రీడా రంగంలో ఆయన మరో ఎన్నో పురస్కారాలు అందుకోవాలని కోరుకుందాం.

Also Read: Pawan Kalyan CM Candidate: పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్.. టీడీపీతో పొత్తుకు బీజేపీ ముందస్తు షరతు?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version