https://oktelugu.com/

Fake cashew nuts in the market: మార్కెట్లో నకిలీ జీడిపప్పులు.. పండుగ వేళ తింటే వారి పని ఖతం.. ఇలా గుర్తించండి

జీడిపప్పులో ఎన్నో పోషకాలు ఉంటాయి. తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. అందుకే వీటిని తింటే ఎలాంటి గుండె సమస్యలు రావు. గుండె ఆరోగ్యం కూడా మెరుగు అవుతుంది. అంతేకాకుండా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఎముకల బలంగా ఉండటం కోసం జీడిపప్పు తినవచ్చు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : October 21, 2024 / 03:15 PM IST

    Fake cashew nuts in the market

    Follow us on

    Fake cashew nuts in the market: డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువగా ఇష్టపడేది చాలా మంది జీడిపప్పు. జీడిపప్పును బిర్యానీ, పాయసం, స్వీట్స్‌ లో కూడా ఉపయోగిస్తారు. జీడిపప్పులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి త్వరలో దీపావళి వస్తుంది. మీ ఇంట్లో కూడా చాలా స్వీట్లు చేస్తారు కదా. మరి ఈ పండగకు జీడిపప్పుకి మంచి డిమాండ్ ఉంటుంది. దీపావళికి చాలా మంది ఇచ్చే గిఫ్టుల్లో జీడిపప్పు కంపల్సరీగా ఉంటుంది. అయితే, మార్కెట్‌లో ఉన్న డిమాండ్ కారణంగా నకిలీ జీడి పప్పు కూడా ఇంటికి వస్తుంటుంది. నకిలీ జీడి పప్పుతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. నకిలీ జీడిపప్పులో ఉండే హానికరమైన రసాయనాలు మీకే డేంజర్. అందుకే నకిలీ జీడిపప్పును గుర్తించాలి. మరి ఎలాగంటారా?

    జీడిపప్పులో ఎన్నో పోషకాలు ఉంటాయి. తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. అందుకే వీటిని తింటే ఎలాంటి గుండె సమస్యలు రావు. గుండె ఆరోగ్యం కూడా మెరుగు అవుతుంది. అంతేకాకుండా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఎముకల బలంగా ఉండటం కోసం జీడిపప్పు తినవచ్చు. జీడిపప్పు తింటే.. రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. జీడిపప్పులో ఉండే ఐరన్, రాగి.. ఇమ్యూనిటీ పవర్ పెంచుతాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ప్రోటీన్, ఖనిజాలు, ఫైబర్ లు ఉంటాయి. ఇలా చెప్పుకుంటే పోతే బోలెడు లాభాలు ఉన్నాయి. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువ. దీంతో.. మార్కెట్లో నకిలీ జీడిపప్పు అమ్మకాలు ఎక్కువయ్యాయి. అయితే, కొన్ని చిట్కాల ద్వారా నకిలీ జీడిపప్పును గుర్తించవచ్చు.

    స్వచ్ఛమైన జీడిపప్పు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇది త్వరగా చెడిపోదు. అయితే, నకిలివీ మాత్రం ఇలా కాదు. తక్కువ క్వాలిటీతో ఉండటం వల్ల త్వరగా పాడవుతాయని నిపుణులు చెబుతున్నారు. నకిలీ జీడిపప్పులో పురుగులు కూడా ఉండవచ్చంటున్నారు. సరిగ్గా స్టోర్ చేస్తే కొన్ని నెలల వరకు ఫ్రెష్‌గా ఉంటాయి జీడిపప్పులు. అందుకే వీటిని కొనేటప్పుడు నాణ్యతను చెక్ చేయాలి. ఇందుకోసం.. ఏదైనా ఒక డబ్బా తీసుకోండి. ఇందులో జీడిపప్పుల్ని వేసి షేక్ చేసినప్పుడు వాటి సౌండ్ మెటాలిక్‌గా అన్పించినప్పుడు అవి ఫేక్ అయి ఉండవచ్చు. అంతేకాదు నకిలీ జీడిపప్పుల్లో రసాయనాలు పొడి డబ్బాలో కన్పిస్తుంది.

    జీడిపప్పు ఏ రంగులో ఉందో నిర్ధారించుకోవడం కూడా ముఖ్యం. స్వచ్ఛమైన తెలుపు, క్రీమ్ కలర్ ఉంటే అవి నిజమైనవి జీడిపప్పులే అనుకోవచ్చు. నకిలీ జీడిపప్పు లేత పసుపు రంగులో ఉంటాయి. జీడిపప్పు కొనుగోలు చేసేటప్పుడు వాటిపై రంధ్రాలు, నల్ల మచ్చలు ఉంటే వాటిని కొనకపోవడమే మంచిది. అంతేకాకుండా.. కొన్ని కల్తీ జీడిపప్పు బాగా తెల్లగా ఉండొచ్చు. వీటిని ఈజీగా గుర్తించవచ్చు. అందుకే కొనేముందు.. కలర్‌ను చెక్ చేయడం మంచిదంటున్నారు నిపుణులు.

    నిజమైన జీడిపప్పు తింటే చాలా రుచిగా ఉంటాయి. నోటికి.. వెన్న తిన్నంత ఫీల్ ఉంటుంది. అయితే, నకిలీ జీడిపప్పు ఇంత టేస్ట్ ఉండవు. వీటిని తింటే కొంచెం చేదుగా ఉండవచ్చు. అంతేకాకుండా నోటికి, దంతాలకు అంటుకుపోతాయి. అంతేకాకుండా ఏదో పిండి తిన్న ఫీలింగ్ వస్తుంది. అందుకే.. కొనుగోలు చేసేటప్పుడు.. రుచి బాగున్నాయో లేదో చెక్ చేయండి.

    స్వచ్ఛమైన జీడిపప్పు ఒక అంగుళం పొడువు, కొద్దిగా మందంగా ఉంటాయి. అయితే, నకిలీవి ఇలా ఉండవు. మరీ చిన్నవిగా లేదంటే పెద్దవిగా కనిపించవచ్చు. కొందరు హైబ్రీడ్ జీడిపప్పు అంటూ మీకు అమ్మే అవకాశం ఉంది. అందుకే వాటిని త్వరగా గుర్తించాలి. లేదంటే ఆరోగ్యాని డేంజర్.

    * జీడిపప్పు నిజమో, నకిలీదో చెక్ చేయడానికి నీటిని వాడుకోవచ్చు. కొన్ని జీడిపప్పుల్ని తీసుకుని.. శుభ్రమైన గిన్నెలో 5 నిమిషాల పాటు నానబెట్టలి.* నిజమైన జీడిపప్పు మందంగా ఉంటుంది. అందుకే అవి సాధారణంగా మునిగిపోతాయి.* అయితే, నకిలీవీ తక్కువ సాంద్రత వల్ల నీటిలో తేలుతుంటాయి. అయితే సైజ్ ఎక్కువ ఉన్నా కూడా నీటిలో తేలుతుంటాయి. మరో విషయం ఏంటంటే వీటిని రంగు ద్వారా కూడా కనిపెట్టొచ్చు.* ఇందుకోసం గిన్నెలో జీడిపప్పును 30 నిమిషాల పాటు ఉంచాలి. నకిలీ జీడిపప్పు ఎక్కువ రంగును విడుదల చేస్తాయి.మీకు ఆయిల్ పొర కనిపించినా సరే అవి నకిలీవి అని నిర్ధారణకు వచ్చేయాలి.

    Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..