Former minister Vishwaroop son : ఆంధ్రప్రదేశ్‌లోని అబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం అయినవిల్లికి చెందిన దళిత యువకుడు జనుపల్లి దుర్గాప్రసాద్ మిస్సింగ్, ఆపై అనుమానాస్పద మృతి కేసులో వైసీపీ మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ తనయుడు పినిపె శ్రీకాంత్‌ను పోలీసులు ప్రధాన నిందితుడిగా చేర్చారు. దళిత యువకుడిది హత్యే అని పినిపే శ్రీకాంత్ హత్య చేశాడని పోలీసుల అదుపులో ఉన్న ధర్మేశ్ విచారణలో వెల్లడించాడు. దీంతో ఈకేసులో మరో నలుగురు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. శ్రీకాంత్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. దీంతో ఆయన కోసం గాలింపు చేపట్టారు. అయితే ఇన్ని రోజులు తప్పించుకు తిరిగిన పినిపే శ్రీకాంత్‌ను ఎట్టకేలకు తమిళనాడులో పట్టుకున్నారు.
ఏం జరిగిందంటే..
అయినవిల్లి గ్రామానికి చెందిన జనుపల్లి దుర్గాప్రసాద్ అదే గ్రామంలో వలంటీర్‌గా పనిచేసేవాడు. పినిపే విశ్వరూప్‌కు ఆరోగ్యం బాగాలేప్పుడు నియోజకవర్గాన్ని ఆయన కుమారుడు శ్రీకాంత్ చూసుకున్నాడు. ఆ తర్వాత తనకు పి.గన్నవరం టికెట్ ఇచ్చేందుకు జగన్ అంగీకరించారని చెబుతూ అక్కడ రాజకీయ పర్యటనలు చేశారు. ఆ సమయంలో దుగ్గాప్రసాద్ అనుచరుడిగా మారాడు. కొద్ది రోజుల్లోనే దుర్గాప్రసాద్ ఎదిగాడు. శ్రీకాంత్ ముఖ్య అనుచరుల్లో ఒకడిగా మారాడు. అయితే 2022లో కోనసీమ అల్లర్లు జరిగాయి. నెల రోజులు కర్ఫ్యూ కొనసాగింది. ఈ సమయంలో దుర్గాప్రసాద్ అదృశ్యమయ్యాడు. అయితే అల్లర్లకు భయపడే పారిపోయాడని ప్రచారం చేశారు. కానీ, ముక్తేశ్వరం–కోటిపల్లి రేవు వద్ద దుర్గాప్రసాద్ మృతదేహం లభించింది. అనుమానాస్పద మృతిగా మిస్సింగ్ కేసును పోలీసులు మార్చారు. పోస్టుమార్టంలో మెడ ఎముక విరిగి మృతిచెందినట్లు నిర్దారణ అయింది. అయితే అప్పట్లో విశ్వరూప్ మంత్రిగా ఉ ండడంతో రాజకీయ ఒత్తిళ్లతో కేసు పెండింగ్‌లో ఉంది. తాజాగా టీడీపీ అధికారంలోకి రావడంతో పాత కేసు విచారణ వేగవంతమైంది. నిందితులను అరెస్టు చేస్తున్నారు. అరెస్టు చేసి నిందితుడి ఇచ్చిన సమాచారంతో విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు.
తమిళనాడులో అరెస్ట్..
అయితే ప్రధాన నిందితుడిగా చేర్చిన నాటినుంచి కనిపించకుండా పోయిన శ్రీకాంత్‌ను ఏపీ పోలీసులు తమిళనాడులోకి మధురైలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. అతడిని రేపు ఏపీకి తీసుకువస్తారని తెలిసింది. న్యాయమూర్తి అనుమతి తీసుకునే తరలించే అవకాశం ఉంది.