Central Government Jobs: ది ఫర్జిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్ అనుభవం ఉన్న ఉద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజనీర్ డిజైన్, రెసిడెంట్ కన్‌స్ట్రక్షన్ మేనేజర్, సైట్ సూపర్‌వైజర్ పోస్టులతో పాటు సీనియర్ మేనేజర్ డిజైన్, డిప్యూటీ మేనేజర్ డిజైన్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం.

35 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సును కలిగి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు వెంటనే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 23,200 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. ఇంజనీరింగ్ డిప్లొమా/బీఈ/బీటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులని చెప్పవచ్చు.
Also Read: కేసీఆర్ ‘ప్రధాని’ ఆశ అడియాశలేనా? ఒకవేళ మోడీ ఓడిపోతే కేజ్రీవాల్ కే ఛాన్స్?
సంబంధిత పనిలో అనుభవం ఉన్న ఉద్యోగులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2022 సంవత్సరం మార్చి 29వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. https://fact.co.in/ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.
Also Read: జనసేన-తెలుగుదేశం కలిసి పోటీచేస్తాయా? చేస్తే ఎవరికి లాభం? ఎవరికి నష్టం?