Uday Kiran Movies Stopped In The Middle: టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవిలాగా స్వయంకృషితో ఎదిగిన హీరో ఉదయ్ కిరణ్. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వరుసగా మూడు హిట్స్ కొట్టి టాలీవుడ్ లో ఓ సంచలనం సృష్టించాడు. అయితే కాలం కలిసిరాక అవకాశాలు లేక చివరకు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఒక మంచి భవిష్యత్ హీరో ఇలా అర్ధాంతరంగా తనువు చాలించాడు.

టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన హీరో ఉదయ్ కిరణ్ కేవలం మొదటి మూడు సినిమాలకే స్టార్ హీరోగా మారాడు. తొలి ‘చిత్రం’ సినిమాతోనే సూపర్ హిట్ సాధించాడు. ఆ తర్వాత ‘నువ్వు-నేను’ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. ఇక మూడో సినిమా ‘మనసంతా నువ్వే’తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. వరుసగా మూడు హిట్స్ తో ఉదయ్ కిరణ్ టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగాడు. ఆయనకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
మనసంతా నువ్వే సినిమా తర్వాత ఉదయ్ కిరణ్ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ‘కలుసుకోవాలని..’, శ్రీరామ్ చిత్రాలు అంతగా ఆడలేదు. ఆ తర్వాత నుంచి సీన్ రివర్స్ అయ్యింది. నీ స్నేహం, నీకు నేను.. నాకు నువ్వు, ఔనన్నా కాదన్నా సినిమాలు తప్ప అన్నీ ఫ్లాప్ అయ్యాయి. తర్వాత ఉదయ్ కిరణ్ సినిమాలను ఎవరూ పట్టించుకోలేదు.
2014లో ఎవ్వరూ ఊహించని విధంగా ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మానసికంగా కృంగిపోవడం వల్లనే అతడు ఈ అఘాయిత్యం చేసుకున్నాడన్న టాక్ నడిచింది. దీనివెనుక కారణాలు ఇప్పటికీ బయటపడలేదు.
Also Read: Star Heroes: స్టార్ హీరోలకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఇవే..!
దీంతో ఉదయ్ కిరణ్ ఒప్పుకున్న సినిమాలన్నీ షూటింగ్ దశలోనే ఆగిపోయాయి. ఆ సినిమాలు చేసి ఉంటే ఖచ్చితంగా మంచి హిట్స్ అందుకునేవాడు.
స్టార్ నిర్మాత ఏఏం రత్నం ఉదయ్ కిరణ్ తో ‘ప్రేమంటే సులువు కాదురా’ అన్న సినిమాను 40శాతం షూటింగ్ పూర్తి చేశాడు. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ప్రత్యూష క్రియేషన్స్ బ్యానర్ పై ఉదయ్ కిరణ్-అంకిత హీరోహీరోయిన్లు సినిమా ప్రారంభించారు. అదీ రద్దైంది. ఇక అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్-అశిన్ జంటగా ప్లాన్ చేసిన చిత్రం ఆగిపోయింది. బాలకృష్ణ-సౌందర్య కలిసి చేసిన నర్తనశాలలో ‘అభిమాన్యుడి’గా ఉదయ్ కిరణ్ ను అనుకున్నారు. సౌందర్య, ఉదయ్ కిరణ్ మరణంతో ఇదీ పట్టాలెక్కలేదు.

ఇక త్రిష-ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో ‘జబ్ వీమెట్’ తెలుగులో రిమేక్ చేయాలనుకున్నారు అదీ సాధ్యం కాలేదు. సూపర్ గుడ్ ఫిలింస్ వారు లవర్స్ సినిమాను ఉదయ్ కిరణ్-సదాతో అనుకున్నారు. అదీ రద్దైంది. ‘ఆదిశంకరాచార్య’ మూవీ కూడా పట్టాలెక్కలేదు. ఎంఎస్ రాజు, చంద్రశేఖర్ ఏలేటి లు కూడా ఉదయ్ కిరణ్ తో సినిమాలు ప్లాన్ చేశారు. దర్శకుడు తేజ కూడా ఉదయ్ కిరణ్ కష్టకాలంలో ఉంటే సినిమా అనుకున్నాడట.. అవీ సాధ్యం కాలేదు. ఇలా దాదాపు 10 సినిమాలకు పైగా ఉదయ్ కిరణ్ చేయలేకపోయాడు. అవి చేసి ఉంటే హిట్స్ అయితే వేరే లెవల్ లో ఉండేవాడు.
Also Read: Ravi teja – Nikhil: రవితేజతో నిఖిల్.. హిట్ కొడతారా ?