Pigeon Message: ఇప్పుడంటే ఒక చోట నుంచి మరొక చోటకు సమాచారం ఇవ్వడం అంటే క్షణాల్లో పని. సెల్ ఫోన్. లేదంటే మెయిల్ లేదంటే ఉత్తరాల లాంటివి మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ పూర్వం మాత్రం పావురాల ద్వారా సమాచారాన్ని చేరవేసేవారు. అయితే ఈ పావురాలు సరిగ్గా గమ్య స్థలాన్ని ఎలా గుర్తిస్తాయన్నది ఇప్పటికీ పెద్ద డౌటే. అయితే ఇవి ఎలా గుర్తిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పావురాలను ఒక చోట నుంచి మరొక చోటకు వీటిని తీసుకెళ్లేటప్పుడే కొన్ని ల్యాండ్ మార్క్‌లను గుర్తుంచుకుంటాయి. నదులు, కొండల్లాంటి వాటిని అవి బాగా గుర్తు పెట్టుకుంటాయి. వీటిని ఇలా ఒక చోట నుంచి మరొక చోటుకు తీసుకెళ్లేటప్పుడు పంజరాల్లో వాటిని తీసుకెళ్తారు. కాబట్టి ఇవి ఏ చోట నుంచి వాటిని తీసుకు వచ్చారో ఆ చోటకు మాత్రమే అవి సమాచారాన్ని మోసుకెళ్తాయి. అంతే గానీ ఇతర చోటకు అంటే వాటికి తెలియని చోటుకు అవి అస్సలు వెళ్లవు.
Also Read: గల్లీలో అధికారం కోసమే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారా?
లైట్ వెయిట్ ఉన్న వస్త్రంలో కొంత సమాచారాన్ని రాసి దాని కాలికి కట్టేవారు. ఎందుకంటే ఎక్కువ బరువు ఉన్న వాటిని కడితే అవి మోసుకెళ్లలేవు. ఆ రోజుల్లో ఈ పావురాలు మిగతా వాటికంటే వేగంగానే సమాచారాన్ని చేరవేసేవంట. మన భూమికి అయస్కాంత శక్తి ఎలా ఉంటుందో.. ఈ పావురాలకు ఎర్త్ మాగ్నేటిక్ పేల్స్‌ను గుర్తించే శక్తి ఉంటుంది.

కాబట్టి ఇవి వాటిని ఆధారంగా చేసుకుని దిక్కులను గుర్తిస్తాయి. అయితే అప్పట్లో ఒక్క పావురంతో కాకుండా నాలుగు లేదంటే ఐదు పావురాలతో ఈ సమాచారాన్ని పంపేవారంట. ఎందుకంటే వేటగాళ్ల వలలో చిక్కితే.. మిగతా వాటిల్లో ఒక్కటి అయినా అనుకున్న గమ్య స్థలాన్ని చేరుతాయనే నమ్మకంతో ఇలా ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునేవారన్న మాట.
Also Read: పవన్ సినిమా సెట్స్ కోసం 10 కోట్లు