Tollywood Crazy Updates: టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. తమిళ బిగ్‌బాస్ షోకి మొదటినుంచి వ్యాఖ్యతగా వ్యవహరించిన కమల్ హాసన్ తప్పుకోవడంతో.. షోకు హోస్ట్ ఎవరనే దానిపై తమిళ బుల్లితెరలో చర్చలు జరుగుతున్నాయి. అయితే తాజాగా హీరో శింబు హోస్ట్ గా వ్యవహరించనున్నారనే వార్తలు ఒక వైపు వినిపిస్తుంటే.. మరో వైపు రాధికా ఈషోకు వ్యాఖ్యాతగా చేయనున్నట్లు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. చివరికి ఎవరు ఈషోను హోస్ట్ చేయబోతున్నారనే విషయం బిగ్‌బాస్ యాజమాన్యం తెలియచేయాల్సి వస్తుంది.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో.. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లకు ఉన్నంత క్రేజ్‌ఎవరికీ లేదు. అయితే.. ఇలాంటి నేపథ్యంలో.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకే స్క్రీన్ లో కనిపిస్తే.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతారు. అదే నిజమైంది. తాజాగా.. వీరిద్దరూ కలిసి షూటింగ్ లో పాల్గొన్న ఓ వీడియోను సితార ఎంటర్ టైన్‌మెంట్స్ విడుదల చేసింది. ఈ వీడియోను హీరో రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేశారు.

Also Read: రివ్యూ: ‘వలిమై’
ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. వలిమై’… ‘వలిమై’… ‘వలిమై’ సోషల్‌మీడియాలో ఇప్పుడిదే సోషల్ మీడియాలో ట్రెండింగ్. రెండేళ్ల విరామం తర్వాత తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ఈ మూవీ నేడు(గురువారం) విడుదలై నెట్టింట్లో సూపర్‌హిట్ టాక్‌ను తెచ్చుకుంది. సినిమా చూసిన అభిమానులంతా చిత్రం అదిరిపోయిందని పొద్దున్న నుంచి సోషల్ మీడియాలో రివ్యూలు ఇస్తున్నారు. థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. ఫ్యాన్స్.. ఈలలు, కేరింతలతో హోరెత్తిస్తున్నారు.

Also Read: ‘భీమ్లానాయక్’ వేడుకలో పవన్ కళ్యాణ్ ప్రసంగంపై రాంగోపాల్ వర్మ హాట్ కామెంట్స్