https://oktelugu.com/

Don’t say These 4 Words to Your Wife: వీలైనా.. కాకున్నా.. ఈ 4 మాటలను భార్యతో అస్సలు అనొద్దు..

ఒక వ్యక్తికి రెండు రకాల జీవితాలు ఉంటాయి. వీటిలో ఒకటి తల్లిదండ్రులతో .. మరొకటి పెళ్లయిన తరువాత జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేయడం.. పెళ్లయే సమయంలో ఇద్దరు తెలియని వ్యక్తులు ఒక్కటవుతారు.

Written By: Srinivas, Updated On : November 14, 2024 11:19 am

Don't-say-These-4-Words-to- Your Wife

Follow us on

Don’t say These 4 Words to Your Wife: ఒక వ్యక్తికి రెండు రకాల జీవితాలు ఉంటాయి. వీటిలో ఒకటి తల్లిదండ్రులతో .. మరొకటి పెళ్లయిన తరువాత జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేయడం.. పెళ్లయే సమయంలో ఇద్దరు తెలియని వ్యక్తులు ఒక్కటవుతారు. మంత్రోచ్ఛరణాల మధ్య.. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య వీరి బంధం ఏర్పడుతుంది. ఇంతటి పవిత్రమైన బంధం శాశ్వతంగా ఉండాలిన ఎవరైనా కోరుకుంటారు. కానీ పెళ్లయిన తరువాత కొందరు దంపతులు వారి మధ్య ఇగో రావడంతో ఒకరిపై ఒకరు పెత్తనం సాగించాలని అనుకుంటారు. మరకొందరు మాత్రం ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు సాగుతారు. ఒకరి తప్పులను మరొకరు మన్నించుకుంటూ కలిసి మెలిసి జీవించడం వల్ల ఎంతో హాయిగా ఉంటుంది. అయితే ఎంత సాన్నిహిత్యం ఉన్నా కొన్ని విషయాలను భార్యతో అస్సలు ఈ మాటలను భర్త అనకూడదని కొందరు మానసిక శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఈ చిన్న మాటల ద్వారా Wife Andh Husband రిలేషన్ దెబ్బతింటుందని అంటున్నారు. మరి అనకూడని ఆ మాటలు ఏంటి?

భార్యభర్తల మధ్య ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి కోపం రావొచ్చు..మరొసారి ప్రేమ కలగవచ్చు. అయితే ఒక్కోసారి కొన్ని విషయాల్లో భార్య అర్థం చేసుకోకపోవచ్చు. భర్త చేసే పనులను వ్యతిరేకించవచ్చు. ఇది తమ జీవితానికి మంచే అవుతుందని భావించారు. ఇలా కాకుండా నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు.. అనే మాటలు చెప్పొద్దు. ఇలా చెప్పడం వల్ల భార్యకు భర్తపై వ్యతిరేక భావన కలుగుతుంది. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది.

Marriages Are Madi In Even అంటారు. ఆ కోణంలో ఆలోచిస్తే ఎవరు ఎవరికి దగ్గరవుతారో ఎవరూ చెప్పలేరు. దీంతో ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో.. వారితో హ్యాపీగా ఉండడం వల్ల ఎలాంటి నష్టాలు ఉండవు. అయితే దంపతుల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు రావడంతో కొందరు ఇతరులను చూసి అసూయ పడుతారు. తమకు మంచి భర్త లేదా మంచి భార్య ఉండాలని ఆలోచిస్తారు. కానీ కట్టుకున్నవారితోనే ఆనందంగా ఉండడం వల్ల జీవితం హ్యపీగా ఉంటుంది. అలా కాకుండా నీలాంటి వారిని పెళ్లి చేసుకుంటానని అనుకోలేదు.. నీకంటే వేరే వారు బాగుంటారు.. అనే మాటలు అనొద్దు.

దంపతుల్లో ఇద్దరూ సమర్థవంతంగా ఉంటారనడానికి ఆస్కారం లేదు. వీరిలో ఒకరు తెలివి కలవారు ఉండొచ్చు.. మరొకరు కాస్త వెనుకబడి ఉంటారు. అంతమాత్రాన తక్కువ శక్తి ఉన్న వారిని నిందించొద్దు. పదే పదే నువ్వు అసమర్థుడిని అని అనడం వల్ల వారు తీవ్ర మనస్థాపానికి గురవుతారు. దీంతో వారితో కలిసి ఉండడానికి ఇష్టపడరు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగి విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి.

రెండు కుటుంబాలు కలిస్తేనే దాంపత్య జీవితం ప్రారంభం అవుతుంది. కానీ కొందరికి కుటుంబ సభ్యులు అంటే నచ్చదు. వారితో కలిసి ఉండడానికి అస్సలు ఇష్టపడదు. ఈ క్రమంలో భార్య లేదా భర్త కుటుంబ సభ్యులను పదే పదే నిందించడం వల్ల మనస్పర్థలు వస్తాయి. దీంతో ఒకరిపై ఒకరికి చెడు ప్రభావం పడుతుంది. క్రమంగా విడిపోయే అవకాశం కూడా ఉంటుంది.