https://oktelugu.com/

children : మీ పిల్లలకు ఈ ఆహారాలను అసలు ఇవ్వవద్దు.

పిల్లల ఆరోగ్యం చాలా ముఖ్యం. వారి ఆరోగ్యం కోసం చాలా ఆలోచించాలి. వారి బరువు పెరగడం దగ్గర్నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చూడటం కోసం ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటారు పేరెంట్స్. ఇక జలుబు, దగ్గు వచ్చిందంటే చిన్న చిన్న ఇంటి చిట్కాలు పాటిస్తుంటారు. కొందరు బరువు, ఎత్తు పెంచేందుకు ప్రత్యేకమైన ఆహారాలను కూడా ఇస్తుంటారు. మీరు ఇచ్చే ఆహారం ఆరోగ్యకరమైనది అయితే సమస్య లేదు. కానీ కొన్ని ఆహారాలు పిల్లలకు ఇవ్వకూడదు. అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి ఐదేళ్ళలోపు పిల్లలకి కొన్ని ఫుడ్స్ ఇవ్వవద్దు. లేదంటే వారి ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. ఇంతకీ ఆ ఆహారం ఏంటి అనుకుంటున్నారా?

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 15, 2024 / 12:16 AM IST

    Do not give these foods to your children.

    Follow us on

    children :  ఆవు పాలు ఆరోగ్యానికి చాలా మంచివి కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు చాలా మంది వీటిని తీసుకుంటారు. అయితే వీటిని తీసుకోవడం వల్ల పెద్దలకు మంచిది. కొన్ని సార్లు పిల్లలకి కూడా చాలా మంచిదే. కానీ సంవత్సరంలోపు వయసున్న పిల్లలకి మాత్రం ఈ ఆవు పాలు మంచిది కాదు. దీని వల్ల పిల్లలకు జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.

    ఐదు సంవత్సరాల పిల్లల వరకు కూడా ప్రాసెస్డ్ మీట్ ఇవ్వకూడదు. ఈ ఆహారంలో సోడియం ఉంటుంది. అంతేకాదు పిల్లలకి హాని కలిగించే అన్‌హెల్దీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. సోడా, ఫ్రూట్ జ్యూస్ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు నిపుణులు. వీటిని ఇవ్వడం వల్ల పిల్లలకి ఊబకాయం వస్తుంది. దంతాల సమస్యలు వస్తాయి.

    పిల్లలకు నాలుక మీద తేనెని రాస్తారు. ఇలా చేయడం మంచిది కాదు. పుట్టిన పిల్లలకే కాదు.. సంవత్సరం, రెండేళ్ళ పిల్లలకి కూడా ఈ తేనె ఇవ్వవద్దు. తేనెలో టాక్సిక్ బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి పిల్లలపై నెగెటీవ్ ఎఫెక్ట్స్‌ని చూపిస్తాయి. ఫుడ్ పాయిజనింగ్‌ అవుతుంది సో జాగ్రత్త.

    ఫ్రై చేసిన ఫుడ్స్ ను కూడా పిల్లలకు దూరంగానే ఉంచండి. వీటిని ఎక్కువగా నూనెలో ఫ్రై చేస్తారు. ఇవి ఆరోగ్యానికి ఎవరికి మంచివి కావు అంటున్నారు నిపుణులు. వీటి వల్ల బాడీలో ట్రాన్స్ ఫ్యాట్ పెరిగుతుంది. దీంతో పిల్లలకి అనేక చాలా సమస్యలు వస్తాయి. బరువు పెరుగుతుంటారు. పిల్లలకు ఫాస్ట్ ఫుడ్ ను కూడా ఇవ్వవద్దు.

    టీ, కాఫీలను కూడా మీ పిల్లలకు అలవాటు చేయించవద్దు. ఈ టీ, కాఫీలు పెద్ద వారికి కూడా మంచిది కాదు. ముఖ్యంగా అతిగా టీ, కాఫీలు తీసుకునే వారికి అసలు మంచిది కాదు. చాలా సమస్యలు వస్తాయి. అయితే కాఫీలోని కెఫిన్ పిల్లలకు మంచిది కాదట. ఇది నాడీ వ్యవస్థపై నెగెటీవ్ ఎఫెక్ట్‌ని చూపిస్తుంది అంటున్నారు నిపుణులు. నిద్రలేమి సమస్య వస్తుంది. కాబట్టి, 12 ఏళ్ళలోపు చిన్నారులకి కాఫీ టీ లు ఇవ్వకపోవడమే చాలా మంచిది.