
Mentally Disabled Old Man : ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతలే మిన్న. వంద మాటలు చెప్పే బదులు ఒక్క పని చేసి చూపండి అంటారు. మానవ సేవే మాధవ సేవ అని చెబుతారు. మనిషిలో కూడా దేవుడిని చూడొచ్చు.దానికి భూత దయ కావాలి. జీవాలను ప్రేమించాలి. అప్పుడే సాధ్యం అవుతుంది. మనిషి మనిషిలా బతికితే మంచి వాడవుతాడు. అదే మనిషిలో స్పందించే గుణం లేకపోతే ఎన్ని చెప్పినా కుదరదు. కష్టాల్లో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు వస్తే అందులో ఉండే మజానే వేరు.
ఖమ్మం జిల్లాలోని అన్నం ఫౌండేషన్ అభాగ్యుల పాలిట ఆపన్నహస్తంలా మారింది. ఎంతో మంది అనాథల పాలిట కామధేనువులా కనిపిస్తోంది. దివ్యాంగులకైతే ఎన్నో సేవలు చేస్తోంది. మానసిక దివ్యాంగులు సైతం ఈ ఫౌండేషన్ లో చాలా మంది తల దాచుకుంటున్నారు. మనం కూడా స్పందించి వారి సంక్షేమానికి ఎంతో కొంత సాయం చేయడానికి ముందుకు వస్తే మంచిది.
ఇదే ఫౌండేషన్ లో ఓ ముసలి వ్యక్తి ఓ ఫొటో వేశాడు. పర్వతం ఎత్తుకుపోతున్న హనుమాన్ బొమ్మ వేయడంతో అందరు ఆశ్చర్యపోయారు. మతిస్థిమితం లేని వ్యక్తి అలా బొమ్మ వేయడంతో అందరు కంగు తిన్నారు. అతడిలో ఉన్న ప్రతిభకు ఫిదా అయ్యారు. ఆంజనేయుడు చిత్రం గీసిన తీరు చూసి అందరు మంత్రముగ్ధులయ్యారు.
అతడు గీసిన బొమ్మకు ఎంతో పొంగిపోయారు. అతడిలో ఉన్న నైపుణ్యానికి మురిసిపోయారు. ఓ చిత్రకారుడు ఎలా గీస్తాడో అచ్చం అలాగే గీశాడు. దీంతో మతిస్థిమితం లేకపోయినా టాలెంట్ ఉండటం గొప్ప విషయం మొత్తానికి అతడు గీసిన బొమ్మ అందరిలో ఆలోచనలు నింపింది. అతడు చేసిన పనికి అందరు శాల్యూట్ చేయొచ్చు. మతిస్థిమితం ఉన్న వారికి కూడా లేని టాలెంట్ అతడికి ఉండటం గమనార్హం.