EPF: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) అనేది ఉద్యోగుల రిటైర్మెంట్ స్కీం. చాలా మంది ఉద్యోగులు తమ జీవితంలో కొంత మొత్తాన్ని ఇందులో దాచుకుంటారు. ఉద్యోగులు పనిచేసే కంపెనీల మేనేజ్మెంట్లు కూడా ఎప్లాయర్ వాటాగా ఉద్యోగుల తరఫున కొంత మొత్తాన్ని జమ చేస్తాయి. ఆదాయపు పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల వరకు డిపాజిట్లను పన్ను మినహాయింపు ఉంటుంది. దీనిపై ఈపీఎఫ్వో ఏటా వడ్డీ చెల్లిస్తుంది.
వడ్డీ వివరాలు ఇవీ..
ఎప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్వో) ప్రకారం.. ఈ ఏడాది జూలై–ఆగస్టు నాటికి ఈపీఎఫ్ ఖాతాలకు వడ్డీ జమ అవుతుంది. ఈ నేపథ్యంలో మీ ఈపీఎఫ్ ఖాతాలో వడ్డీ రేటును ఎలా చెక్చేసుకోవాలో తెలుసుకుందాం. మీ ఖాతాలో రూ.లక్ష నుంచి రూ.3 లక్షలు, రూ.5 లక్షల డిపాజిట్లు ఉంటే.. ఎంత వడ్డీ వస్తుందో తెలుసుకుందాం.
వడ్డీరేటును ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) నిర్ణయిస్తుంది. ఈ సంవత్సరానికి వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటు 8.15 శాతంగా ఉంది. అంటే ప్రస్తుత సంవత్సరం ఈపీఎఫ్ ఖాతాదారులకు వారి ఖాతాలపై ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఈపీఎఫ్ ఖాతాలో రూ.లక్ష ఉంటే.. దానిపై 8.25 శాతం వడ్డీ అందుతుంది. అంటే రూ.8,250 ఖాతాలో జమ అవుతుంది. ఇక రూ.3 లక్షల డిపాజిట్ ఉంటే.. రూ.24,500 వడ్డీ వస్తుంది. ఇక ఖాతాలో రూ.5 లక్షలు ఉంటే.. రూ.41,250 వడ్డీ జమ అవుతుంది.
బ్యాలెన్స్ ఇలా తెలుసుకోవచ్చు..
– ఉమాంగ్ యాప్ లేదా ఈపీఎఫ్వో పోర్టల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
– ఈపీఎఫ్వో పోర్టల్లో లాగిన్ అవండి.
– ఈ పాస్బుక్ ఆప్షన్పై క్లిక్ చేయాలి.
– ఇది మరొక స్క్రీన్లోకి వెళ్తుంది. అక్కడ ఊఏఎన్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
– లాగిన్ అయిన తర్వాత పాస్బుక్ కోసం మెంబర ఐటీ ఆప్షన్ ఎంచుకోవాలి.
– పాస్బుక్ పీడీఎఫ్ ఫార్మాట్లో లభిస్తుంది. దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Epf interest deposit in two months do you know how much you will get
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com