England vs India: సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ చివరి దశకు చేరింది. ఆదివారం పోచెఫ్ స్ట్రూమ్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ ఫైనల్ మ్యాచ్లో తల పడనున్నాయి.. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల 15 నిమిషాల నుంచి జియో టీవీలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.. టైటిల్ కోసం రెండు జట్లు కూడా తీవ్రంగా పోరాడటం ఖాయమని క్రీడా నిపుణులు చెబుతున్నారు.

బ్యాటింగ్ సంచలనం షఫాలీ వర్మ సారధ్యంలోని భారత జట్టు చరిత్ర అంచున నిలిచింది.. మొట్టమొదటి అండర్ 19 వరల్డ్ కప్ టైటిల్ సొంతం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది.. అంతర్జాతీయ క్రికెట్లో భారత మహిళలు ఎన్నో విజయాలు సాధించినప్పటికీ… సీనియర్ స్థాయిలో అటు వన్డే, టి20 ప్రపంచ కప్ లను మాత్రం గెలవలేకపోయింది.. అయితే షఫాలీ వర్మ నేతృత్వంలోని సీనియర్ జట్టు తరఫున రెండు వరల్డ్ కప్ లలో పాల్గొన్నది. అలాగే గత ఏడాది కామన్ వెల్త్ గేమ్స్ ఫైనల్స్ లో ఆడింది. అప్పుడు అందుకో లేకపోయిన ప్రపంచ కప్ ట్రోఫీని ప్రస్తుతం తన కెప్టెన్సీలో ఈ జూనియర్ విభాగంలోనైనా సాధిస్తుందేమో చూడాలి.. శనివారం 19వ ఏట అడుగుపెట్టిన షఫాలి… ఈ కప్ ను గెలిచి తనకు తాను జన్మదిన కానుక ఇచ్చుకోవాలని భావిస్తోంది..
సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ తో తలపడిన భారత జట్టు అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించింది.. ఈ ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టు బలియమైనదే… సెమిస్ లో ఆస్ట్రేలియాపై 99 పరుగులకే కుప్పకూలింది. కానీ బౌలర్లు ముఖ్యంగా స్పిన్నర్లు అద్భుతంగా రాణించడంతో ఆస్ట్రేలియా ను 96 పరుగులకు ఆల్ అవుట్ చేసి నెగ్గింది..
ఇక ఈ టి 20 వరల్డ్ కప్ ప్రస్థానంలో భారత జట్టు ఇప్పటివరకు ఒక ఆస్ట్రేలియా తో తప్ప మిగతా అన్ని మ్యాచ్ల్లోనూ నెగ్గింది.. ముఖ్యంగా షఫాలీ వర్మ తిరుగులేని ఆట తీరు ప్రదర్శిస్తోంది.. ముఖ్యంగా ఆమె బ్యాటింగ్ ఒకప్పటి మిథాలి రాజ్ ను గుర్తుచేస్తోంది. ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయ తీరాల వైపు చేర్చింది.. ఇక ఇంగ్లాండ్ తో పోలిస్తే భారత జట్టు బలంగా ఉన్నప్పటికీ…లీగ్ మ్యాచ్ లో భారత జట్టును ఓడించిన ఆస్ట్రేలియాను… ఇంగ్లాండ్ జట్టు మట్టి కరిపించింది.. 99 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు ఆ దేశ బౌలర్లు తీవ్రంగా శ్రమించారు.. 96 పరుగులకు ఆస్ట్రేలియాను ఆల్ అవుట్ చేసి ఫైనల్ లోకి అడుగు పెట్టారు.. అయితే మైదానం బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని క్యూరేటర్ చెబుతున్నారు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకుంటే భారీ స్కోర్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు ఒలంపిక్ లో బంగారు పతక విజేత నీరజ్ చోప్రా భారత మహిళా క్రీడాకారులకు శనివారం వ్యక్తిత్వ వికాసం పై తరగతులు నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్లో ఒత్తిడికి గురి కాకుండా ఆత్మవిశ్వాసాన్ని ఎలా ప్రోది చేసుకోవాలో వివరించారు.
జట్ల వివరాలు ఇలా
భారత్: షఫాలీ వర్మ, శ్వేత, త్రిష, సౌమ్య, సోనియా, రీచాగోష్, మన్నత్, పర్షవి, సోనమ్, షబ్నం, టి టాస్ సందు, అర్చన దేవి, హ్రిషిత, పాలక్, యశశ్రీ.
ఇంగ్లాండ్
గ్రేస్, అండర్సన్, హనా, గ్రోవర్స్,హీప్, హాలెండ్, మక్ డోనాల్డ్, ఎమ్మా, చారిస్, ఫెరిన్, లజి, సెరెన్, అలెక్సా, సెరెన్.