https://oktelugu.com/

EMI: రోజులు, వారాల ఆనందం కోసం సంవత్సరాలు బాధ పెట్టే ఈఎంఐలు.. తీసుకునే ముందు ఓ సారి ఆలోచించండి

ఇ కామర్స్ సంస్థలు మీకు వస్తువుకు చెల్లించాల్సిన నగదుపై జోరో డౌన్ పేమెంట్ మీద అందిస్తున్నాయి. దీంతో కస్టమర్లు అవి మనకు అవసరం ఎంత వరకు ఉన్నాయనేది చూడకుండా సదరు వస్తువులను కొనేస్తున్నారు.

Written By:
  • Rocky
  • , Updated On : November 4, 2024 6:47 pm
    EMI

    EMI

    Follow us on

    EMI : ఇటీవల కాలంలో పర్సనల్ లోన్లను విరివిగా వినియోగిస్తున్నారు. ప్రజలు తమ అత్యవసర పరిస్థితుల్లో సులభంగా ఈ రుణాలు పొందగలుగుతున్నారు. వీటి సాయంతో పిల్లల చదువులు, పెళ్లి ఖర్చులు, నగదు అప్పటికి ఏర్పడిన కొరత తీర్చుకుంటున్నారు. ఇది తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకుండా నగదును అందిస్తుండడంతో వడ్డీ కాస్త ఎక్కువైనా వీటిని అధికంగా వినియోగిస్తున్నారు. అయితే ప్రతి నెలా దాని ఈఎంఐని చెల్లించాల్సి వచ్చినప్పుడు అది భారం అవుతుంది. ఎక్కువ కాలం ఈఎంఐ చెల్లించాల్సి రావడంతో సంతోషాన్ని కోల్పోతున్నారు. అలాగే అవసరం ఉన్నా లేకున్నా ప్రతి చిన్నదానికి లోన్లు తీసుకుని వాటిని కట్టలేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

    అలాగే ఇటీవల కాలంలో ఇ కామర్స్ బిజినెస్ ఎంతగా విస్తరించిందో అందరికీ తెలిసిందే. మీరు ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తున్నట్లు అయితే ఇ కామర్స్ సంస్థలు మీకు వస్తువుకు చెల్లించాల్సిన నగదుపై జోరో డౌన్ పేమెంట్ మీద అందిస్తున్నాయి. దీంతో కస్టమర్లు అవి మనకు అవసరం ఎంత వరకు ఉన్నాయనేది చూడకుండా సదరు వస్తువులను కొనేస్తున్నారు. తర్వాత కొన్నేళ్ల పాటు వాటిని చెల్లించలేక బాధపడుతున్నారు. అసలు రోజులు, వారాల డబ్బు అవసరాలకు ఏళ్లకు ఏళ్లు ఈఎంఐలు చెల్లిస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు. జీతం పడిందంటే చాలు టక్కున ఈఎంఐ రూపంలో కట్ అయిపోయి నెలాఖరుకు మళ్లీ అప్పులు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అసలు ఈఎంఐలు లేకపోతే ఎంత సంతోషంగా ఉండేదని కట్టేటప్పుడు తెలిసొస్తుంది.

    అందుకే కొందరు నిపుణులు ఈఎంఐల రూపంలో సామాన్యులకు వేసే గాలంలో చిక్కుకోవద్దని సూచిస్తున్నారు. అవి మనిషి ప్రశాంతతను పాడు చేస్తాయని చెబుతున్నారు. డబ్బులుంటే వస్తువును కొనుక్కొని అవసరాలను తీర్చుకోవాలే గానీ ఇలా ఈఎంఐల ద్వారా కొని, లేదా లోన్లు, క్రెడిట్ కార్డు బిల్లులను ఈఎంఐలకు కన్వర్ట్ చేసుకుని లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవద్దంటున్నారు. ఈఎంఐలనేవి బ్యాంకులు సామాన్యులను మభ్యపెట్టి ఎక్కువ డబ్బులు లాగే వడ్డీ వ్యాపారంగా అభివర్ణిస్తున్నారు.

    ఈఎంఐ బాధలు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి
    ఏదైనా లోన్ తీసుకుంటే.. ముందుగా డౌన్ పేమెంట్ పే చేయాలి. ఇది మీ లోన్ పై ఈఎంఐని తగ్గించడానికి దోహదపడుతుంది. అంతేకాక మీ రుణ మొత్తాన్ని కూడా కాస్త తగ్గిస్తుంది. తద్వారా ఈఎంఐ భారం తగ్గుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 10ఏళ్ల కాలవ్యవధికి 11 శాతం వడ్డీ రేటుతో రూ. 10 లక్షల మొత్తాన్ని లోనుగా తీసుకుంటే.. 3 శాతం ప్రాసెసింగ్ ఫీజుతో 15 శాతం డౌన్‌పేమెంట్‌ను చెల్లిస్తే, ఈఎంఐ మొత్తం 11,708.75 అవుతుంది. అయితే, డౌన్ పేమెంట్ మొత్తాన్ని పెంచడం ద్వారా మీ ఈఎంఐ మొత్తం రూ. 9,642.50కి తగ్గుతుంది. మీరు బ్యాంకుకు తక్కువ వడ్డీని కూడా చెల్లించడం ముగుస్తుంది.

    ఎక్కువ కాల వ్యవధి..
    పర్సనల్ లోన్ మొత్తానికి లోన్ వ్యవధితో విలోమ సంబంధం ఉంటుంది. ఎక్కువ కాలం లోన్ కాలవ్యవధి ఎక్కువ కాలంగా విభజించబడినందున ఈఎంఐ తక్కువగా ఉంటుందని అనిపిస్తుంది కానీ.. దీర్ఘకాలిక రుణంతో ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఎవరైనా వడ్డీపై డబ్బు ఆదా చేయాలనుకుంటే, ఎక్కువ మొత్తం ఈఎంఐలతో తక్కువ కాల వ్యవధిని ఎంచుకోవాలి.