Trisha : తమిళ హీరో విజయ్ తో డేటింగ్ గురించి తొలిసారి స్పందించిన హీరోయిన్ త్రిష.. విజయ్ కి ఇది మామూలు షాక్ కాదు!

ఇప్పుడు రీసెంట్ గా ఈమె ఇలయథలపతి విజయ్ తో డేటింగ్ చేస్తున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరు కలిసి విమానాశ్రయం లో కనిపించడం కూడా ఈ రూమర్స్ కి మరింత బలం చేకూరింది. ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. సినీ ఇండస్ట్రీ కి చెందిన వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే వ్యక్తిగత వ్యవహారాలనే తీసుకొచ్చి విమర్శలు చేస్తారు.

Written By: Vicky, Updated On : November 4, 2024 8:07 pm

Thrisha

Follow us on

Trisha : దశాబ్దాల నుండి సౌత్ ఇండియాలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి త్రిష కృష్ణన్. చిన్నతనం నుండి మనమంతా ఈమె సినిమాలు చూస్తూ పెరిగాము. అప్పట్లో ఈమె క్రేజ్ ఎలా ఉండేదో, ఇప్పటికీ అదే రేంజ్ క్రేజ్ తో కొనసాగుతుంది. ఈమధ్యలో ఎంతోమంది యంగ్ హీరోయిన్స్ వచ్చారు. కానీ త్రిష క్రేజ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. ఇప్పటికీ ఈమె భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తూ, ఒక్కో సినిమాకి 8 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటుంది. ఈ స్థాయి రెమ్యూనరేషన్ రీసెంట్ గా స్టార్ హీరోయిన్స్ గా ఎదిగిన వాళ్ళు కూడా తీసుకోవడం లేదు. అయితే ఈమెకి ఎంత క్రేజ్ అయితే ఉందో, అంతటి రూమర్స్ కూడా భారీగానే ఉన్నాయి. కోలీవుడ్ లో ఈమె అనేకమంది యంగ్ హీరోలతో డేటింగ్ చేసినట్టు వార్తలు వినిపించాయి.

ఇప్పుడు రీసెంట్ గా ఈమె ఇలయథలపతి విజయ్ తో డేటింగ్ చేస్తున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరు కలిసి విమానాశ్రయం లో కనిపించడం కూడా ఈ రూమర్స్ కి మరింత బలం చేకూరింది. ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. సినీ ఇండస్ట్రీ కి చెందిన వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే వ్యక్తిగత వ్యవహారాలనే తీసుకొచ్చి విమర్శలు చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయం లో ఇలాంటివి గతంలో చాలానే చూసాము. ఇప్పుడు విజయ్ విషయంలో కూడా అదే జరుగుతుంది. అయితే రీసెంట్ గానే త్రిష ఒక ఇంటర్వ్యూలో తనపై వస్తున్న ఇటువంటి రూమర్స్ పై స్పందించింది.

ఆమె మాట్లాడుతూ ‘సోషల్ మీడియా లో నాపై ఎన్నో వార్తలు ఇష్టమొచ్చినట్టు రాస్తుంటారు. వాటిని పట్టించుకోని నేను నా ఎనర్జీ ని వృధా చేసుకోను. నాకంటూ బోలెడన్ని పనులు ఉన్నాయి, ఇలాంటి పనికిమాలిన వాటికి స్పందించాల్సిన అవసరం లేదు’ అంటూ ఆమె ఘాటుగా చెప్పుకొచ్చింది. పేర్లు ప్రస్తావించకుండా, దేని గురించి తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో చెప్పకుండా, పరోక్షంగా ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా ప్రచారం అవుతున్న విజయ్ తో డేటింగ్ విషయంపై ఆమె ఈ విధంగా స్పందించింది. దీంతో ఇప్పటికైనా ఈ డేటింగ్ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడుతుందా, లేదా ఇంకా కొనసాగుతుందా అనేది చూడాలి. ఇక ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘విశ్వంభర’ లో హీరోయిన్ గా నటిస్తుంది. వీటితో పాటు అజిత్ హీరో గా నటిస్తున్న ‘విడామూయార్చి’ చిత్రంలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తుంది. వీటితో పాటు మరో రెండు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా చేసేందుకు సంతకాలు చేసింది.