Health Tips: స్పూన్ తో తినాలా? చేతితోనా? ఆసక్తికర నిజాలు

21 శతాబ్దం ప్రారంభం నంచి జీవన శైలి మారిపోయింది. కంప్యూటర్ జీవన విధానంలోకి రావడంతో అంతా స్పీడప్ అయిపోయారు. ప్రతి పనిని ప్రాక్టికల్ గా చేస్తున్నారు. 10 రోజుల్లో చేసే పనిని ఒకటి, రెండు రోజుల్లో పూర్తి చేస్తున్నారు.

Written By: Chai Muchhata, Updated On : November 18, 2023 6:38 pm

Health Tips

Follow us on

Health Tips: భారతదేశం సాంప్రదాయాలకు పుట్టనిల్లు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ భూభూగంపై ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. వాటి ప్రకారంగానే మానవులు జీవిస్తున్నారు. పురాతన కాలంలో కొన్ని అవసరాలు తీర్చుకునేందుకు పరిస్థితులను అర్థం చేసుకొని సాంప్రదాయాలు, పద్ధతులు ఏర్పాటు చేశారు. వీటిని ఆ తరవాత తరం వారు ఆచరిస్తున్నారు. అయితే ఇప్పుడంతా కంప్యూటర్ యుగం అన్నట్లుగా మారింది. ప్రతీది టెక్నికల్ గా వర్క్ చేస్తున్నారు. దీంతో సాంప్రదాయాలను పట్టించుకోవడం లేదు. ఫలితంగా అప్పటి వారి కంటే ఇప్పటి వారి జీవన శైలి తో పాటు సగటు ఆయుష్సు తగ్గిపోతోంది. పురాతన కాలంలో అన్నం చేత్తో తినేవారు. ఇప్పటికీ చాలా మంది చేతితోనే భోజనం చేస్తున్నారు. కానీ కొందరు స్పూన్ అలవాటు చేసుకుంటున్నారు. స్కూలు కెళ్లె పిల్లలకు స్పూన్ వేసి పంపుతున్నారు. మరి ఇలా చేయడం మంచిదేనా? అసలు చేతితో తింటే ఏం జరుగుతుంది? స్పూన్ తో తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి?

21 శతాబ్దం ప్రారంభం నంచి జీవన శైలి మారిపోయింది. కంప్యూటర్ జీవన విధానంలోకి రావడంతో అంతా స్పీడప్ అయిపోయారు. ప్రతి పనిని ప్రాక్టికల్ గా చేస్తున్నారు. 10 రోజుల్లో చేసే పనిని ఒకటి, రెండు రోజుల్లో పూర్తి చేస్తున్నారు. కొన్ని అవసరాలకు ఇలాంటి సాంకేతికాన్ని అలవాటు చేసుకోవడం చాలా బెటర్ . కానీ ఆరోగ్యం విషయంలో పురాతన సాంప్రదాయలు పాటించాలనంటున్నారు. ఎందుకంటే అప్పటి వారు కొన్ని ఆహార పద్ధతులు పాటించడం వల్ల వందేళ్ల వరకు హాయగా జీవించారు. అందులో ప్రధానమైనది చేతితో అన్నం తినడం.

పాశ్చాత్య దేశాల్లో ఎక్కడ చూసిన భోజనాన్ని చేతితో తినరు. ప్రత్యేకంగా స్పూన్లు, ఇతర వంట సామాన్లు వాడుతూ ఉంటారు. అలాంటి వారు ఎక్కువగా జబ్బు పడే అవకాశం ఉందని కొందరు సినీ సెలబ్రెటీలు సైతం ప్రత్యేక సందర్బాల్లో చెబుతున్నారు. భారత్ లో చేతితో అన్నం తినేవారి మీద కొందరు వైద్య పరిశోధకులు పరిశీలన చేశారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా చేతితో అన్నం తినేవారు. అలా భోజనం చేసిన ఎక్కువ రోజులు బతికారు అని పేర్కొంటున్నారు.

ఈరోజుల్లో స్కూలుకెళ్లు చిన్నారులకు స్పూన్ తో తినిపిస్తున్నారు. అయితే కొందరు ఉపాధ్యాయులు చెబుతున్న విషయం ఏంటంటే పిల్లలు చేతులను ఎక్కువగా మట్టిలో పెడుతూ ఉంటారు. దీంతో వారు చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం వల్ల క్రిములు ఉంటాయి. అందువల్ల స్పూన్ తో తినేలా ఏర్పాట్లు చేస్తున్నామని అంటున్నారు. అయితే రాను రాను వారు స్పూన్ తో తినడం అలవాటు చేసుకుంటారని, దీంతో చేతితో తినడానికి ఇష్టపడరని అంటున్నారు. అలా చేతితో కాకుండా స్పూన్లతో అన్నం తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని అంటున్నారు.

మరో విషయం ఏంటంటే చేతితో తినడం వల్ల కడుపు నిండడంతో పాటు ఆహారం తిన్న ఫీలింగ్ ఉంటుందంటున్నారు. స్పూన్ తో తినడం వల్ల ఎలాంటి రుచి ఉండదని అంటున్నారు. భారతీయులు ఇలా చేయడం వల్లే వారు ఎంతో ఆరోగ్యంగా ఉండడంతో పాటు పాటు మేథస్సును కలిగి ఉంటారని నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల ఆహారంను చేతితో తినడం అలవాటు చేసుకోవాలి.