Husband and wife : భార్యాభర్తల బంధం చాలా గొప్పది. కానీ చిన్న విషయాలకు కూడా కొందరు భాగస్వామితో గొడవ పడుతుంటారు. చిన్న విషయాన్ని పరిష్కరించుకోకుండా పెద్దది చేసుకుంటారు. సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే. ఎంత పెద్ద గొడవ పడిన సరే.. మళ్లీ వెంటనే కలిసిపోవాలి. అంతే కానీ చిన్న వాటిని పెద్దగా చేసుకుని కొందరు విడిపోయే వరకు తీసుకెళ్తుంటారు. గొడవ వచ్చిన వెంటనే ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. అప్పుడే సమస్య తొలగిపోయి.. మీ ఇద్దరి మధ్య దూరం తగ్గుతుంది. భాగస్వామిలు ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే బంధం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఏ బంధంలో అయిన కూడా కొన్ని తప్పులు చేయకూడదు. వాళ్లకు ఉన్న అలవాట్ల వల్ల బంధంలో కలహాలు ఎక్కువగా వస్తాయి. భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు రాకుండా ఉండాలంటే కొన్ని అలవాట్లు ఉండకూడదు. మరి భార్యాభర్తలకు ఎలాంటి అలవాట్లు ఉంటే ఇద్దరి మధ్య కలహాలు వస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వాదించకూడదు
కొందరు చిన్న విషయానికి గొడవ అయ్యి ప్రతి విషయంలో వాదించుకుంటూ వస్తారు. గొడవ అయితే భాగస్వామితో సరిగ్గా ఉండరు. భాగస్వామిని పట్టించుకోకుండా.. వాళ్లకు నచ్చినట్లు ఉంటారు. మాటకు మాట ఇద్దరూ వాదించుకోవడం వల్ల సమస్యలు తప్పకుండా వస్తాయి. గొడవ సమయంలో ఎవరో ఒకరు తగ్గాలి. అప్పుడే సంతోషంగా ఉంటారు. వాదించుకున్నప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గాలి. అప్పుడే గొడవ పెద్దది కాదు. కాబట్టి గొడవ వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ వాదనలకు దూరంగా ఉండాలి.
భాగస్వామిని అర్థం చేసుకోకపోవడం
భార్యాభర్తలు అన్న తర్వాత అన్ని విషయాల్లో అర్థం చేసుకోవాలి. భాగస్వామి ఒకటి చెబుతుంటే.. తప్పుగా అర్థం చేసుకుంటారు. దీనివల్ల ఇద్దరి మధ్య అపార్థాలు మొదలవుతాయి. కాబట్టి ఇద్దరిలో ఎవరు మాట్లాడినా వాళ్ల మాటలకు గౌరవిస్తూ అర్థం చేసుకుని వినాలి. భాగస్వామి చెబుతుంటే కొందరు.. మొబైల్ చూసుకోవడం, వేరే వాళ్లతో చాట్ చేసుకోవడం వంటివి చేస్తారు. ఇలాంటివి చేయడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
గౌరవం
భాగస్వామిని తప్పకుండా గౌరవించాలి. అప్పుడే బంధం ఎంత విలువైనదో తెలుస్తుంది. కొందరు చిన్న గొడవ వస్తే చాలు.. తప్పుగా మాట్లాడుతారు. స్నేహితుల ముందు భాగస్వామి పరువు తీస్తారు. అలా అందరి ముందు తిట్టకూడదు. అవమానించకూడదు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవాలి. అప్పుడే బంధం ఎన్ని ఏళ్లు అయిన కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది.
ప్రేమ లేకపోవడం
పెళ్లయిన కొత్తలో ఉన్న ప్రేమ తర్వాత ఉండదు. ప్రేమ అలా కాకుండా ఉండాలంటే.. భాగస్వామిని కొత్తగా ప్రేమించండి. భాగస్వామికి నచ్చిన విధంగా ఉండటం, వాళ్లకి నచ్చిన పనులు చేయడం, వాళ్లకు ఇష్టమైనవి ఇవ్వడం వంటివి చేస్తుంటే.. లైఫ్ కొత్తగా ఉంటుంది.
అనుమానం
కొందరు ప్రతి చిన్న విషయానికి భాగస్వామిని అనుమానిస్తారు. ఇలా చేయడం అసలు కరెక్ట్ కాదు. భాగస్వామిని అనుమానించడం వల్ల ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతాయి. దీంతో విడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి భాగస్వామిని అనుమానించవద్దు. వీలైతే అర్థం చేసుకోండి.. జీవితం సంతోషంగా ఉంటుంది.