Jobs: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ డెవలప్‌మెంట్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అసిస్టెంట్ రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 2659 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు.
ఇంటర్ విద్యార్హతతో పాటు ఏదైనా కంప్యూటర్ కోర్సులో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. రాత పరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ పరీక్షలో మొత్తం 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయని తెలుస్తోంది. తప్పు సమాధానానికి నెగెటివ్ 1/3 మార్కింగ్ ఉండగా గంటన్నరలో అన్ని ప్రశ్నలకు సమాధానాలను రాయాల్సి ఉంటుంది.
ఆన్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు దరఖాస్తు ఫీజు 350 రూపాయలు కాగా జనరల్/ఓబీసీ అభ్యర్ధులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉంటుంది. 2022 సంవత్సరం ఏప్రిల్ 20 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది.
https://www.dsrvs.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుందని తెలుస్తోంది.