Dry Fruits: డ్రై ఫ్రూట్స్‌ను ఎన్ని గంటలు నానబెడితే.. ఆరోగ్యానికి మంచిదో మీకు తెలుసా?

నానబెట్టన డ్రై ఫ్రూట్స్‌ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే వీటిని ఎంతసేపు నానబెట్టాలనే విషయం సరిగ్గా ఎవరికి తెలియదు. నానబెట్టాల్సిన సమయం కంటే ఎక్కువగా నానబెడితే వాటిలోని పోషకాలు శరీరానికి అందవు. మరి ఈ డ్రై ఫ్రూట్స్‌ను ఎంత సేపు నానబెడితే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 31, 2024 10:06 pm

Dry Fruits

Follow us on

Dry Fruits: ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు ఉండే ఫుడ్ తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్‌ను డైలీ డైట్‌లో చేర్చుకోవాలి. అయితే రోజూ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. శరీరంలో నీరసం, అలసట పోయి యాక్టివ్‌గా మారుతారు. అయితే ఈ డ్రైఫూట్స్‌లో చాలా రకాలు ఉంటాయి. మనలో చాలామందికి కొన్ని మాత్రమే తెలిసి ఉంటుంది. ఈరోజుల్లో చాలామంది ఎముకల నొప్పితో బాధ పడుతున్నారు. పోషకాలు, కాల్షియం, మెగ్నీషియం ఉండే పదార్థాలను తీసుకోకపోవడం వల్ల ఎముకలు తొందరగా బలహీనంగా మారుతాయి. దీనివల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా ఉండాలని డైలీ కొందరు తప్పకుండా డ్రై ఫూట్స్‌ తింటారు. అయితే కొందరు వీటిలో బాదం, ఎండు ద్రాక్ష, వాల్‌నట్స్‌ను రాత్రిపూట నానబెట్టి ఉదయం తింటారు. ఇలా నానబెట్టన డ్రై ఫ్రూట్స్‌ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే వీటిని ఎంతసేపు నానబెట్టాలనే విషయం సరిగ్గా ఎవరికి తెలియదు. నానబెట్టాల్సిన సమయం కంటే ఎక్కువగా నానబెడితే వాటిలోని పోషకాలు శరీరానికి అందవు. మరి ఈ డ్రై ఫ్రూట్స్‌ను ఎంత సేపు నానబెడితే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం.

 

ఆరోగ్యానికి మేలు చేసే డ్రైఫూట్స్‌ను సుమారుగా 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇన్ని గంటలు నానబెట్టినవి తినడం వల్ల తొందరగా జీర్ణం అవుతాయి. అయితే అంజీర్, ఎండు ద్రాక్ష వంటి వాటిని కేవలం మూడు గంటలు నానబెడితే చాలు. జీడిపప్పు, హాజెల్ నట్స్, బాదం, అత్తి పండ్లు వంటివి ఆరు లేదా ఎనిమిది గంటలు నానబెట్టడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే నీరసం, అలసట పోవడంతో పాటు పేగు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వీటితో పాటు కడుపు సంబంధిత సమస్యల నుంచి బయటపడటంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. డ్రై ఫ్రూట్స్‌లో అన్ని కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. డైలీ వీటిని తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు.

 

ఎండు ద్రాక్షను రాత్రి నానబెట్టి ఉదయం తినడం వల్ల శరీరానికి సరిపడా కాల్షియం అందుతుంది. దీనివల్ల ఎముకలు బలహీనంగా మారకుండా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇందులోని పోషకాలు కండరాలు, ఎముకలను బలంగా చేయడంలో బాగా ఉపయోగపడతాయి. వీటిని డైలీ ఏదో ఒక సమయంలో తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. బరువు తక్కువగా ఉన్నవారు వీటిని తినడం వల్ల తొందరగా బరువు పెరుగుతారు. అలాగే రాత్రి నానబెట్టి ఉదయాన్నే బాదం గింజలను తింటే శరీరానికి తక్షణమే బలం వస్తుంది. ఇందులోని పోషకాలు ఎముకలకు మేలు చేయడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తాయి. వీటిని తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని ముఖ్యంగా పిల్లల తెలివితేటలు పెరుగుతాయని కూడా అంటున్నారు.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.