Dressed with firecrackers: సోషల్ మీడియా వచ్చిన తరువాత చాలా మంది ఏదో రకంగా ఫేమస్ కావాలని చూస్తున్నారు.కొందరు సినిమాల్లో, ఇతర అవకాశాలను పొందడానికి వింతైన వీడియోలు చేస్తుండగా..మరికొందరు మాత్రం ఫేమస్ కావడానికి వీడియోలతో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే విభిన్నంగా కనిపించాలనే ఉత్సాహంతో చాలా మంది వింత ప్రయోగాలు చేసి విఫలమయ్యారు. కొందరు ట్రైన్ నడుస్తుండగా రీల్స్ చేసి ప్రమాదానికి గురైన సంఘటనలు చూశాం.. అలాగే బైక్ పై విన్యాసాలు చేసి ప్రాణాలు పోయిన వారి గురించి తెలుసుకున్నాం. అయితే ఇన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నా.. కొందరు యువకులు మాత్రం ప్రమాదకరమైన పనులు చేయడం ఆపడం లేదు. దీపావళి పర్వదినం సందర్భంగా ఓ యువకుడు చేసిన పనికి అంతా దుమ్మెత్తి పోస్తున్నారు. కొందరు ఇదేం వెర్రీ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడు?
హిందువుల పండుగల్లో అతిపెద్దది దీపావళి. ఈ పండుగను మూడు రోజుల పాటు నిర్వహించుకుంటారు. ప్రత్యేక పూజల చేస్తూ ఉల్లాసంగా ఉంటారు. ఇదే సమయంలో బాణ సంచాలను కాలుస్తూ ఎంజాయ్ చేస్తారు. అయితే పర్యావరణ కాలుష్యం కారణంగా బాణ సంచాల కాల్చొద్దని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. కానీ చిన్న పిల్లలు వీటితో ఎంజాయ్ చేస్తున్నారు. బాణ సంచాల కాల్చడంలో కాస్త నిర్లక్ష్యం వహించినా ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాణ సంచాల కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
అయితే ఓ యువకుడు మాత్రం బాణ సంచాతో రీల్స్ చేశాడు. అతడు తన ఒళ్లునంతా బాణ సంచాలతో కప్పేసుకున్నాడు. కింద ఒక లంగాను ధరించి టాప్ మొత్తం పటాకలతో కవర్ చేశాడు. అంతేకాకుండా చేతిలో దీపం ఉంచి కనిపించాడు. ఈ దీపానికి ఒక్కటి అంటుకున్నా.. శరీరం మొత్త బూడిది కావడానికి పెద్ద సమయం పట్టదు. ఆ విషయం తెలిసినా ఆ యుకుడు ఇలాంటి ప్రయోగం చేయడంపై చాలా మంది వ్యతిరేకిస్తన్నారు. ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఈ ఫొటోల సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రమాదం అని తెలిసినా ఇలా చేయడం కరెక్ట్ కాదని అంతున్నారు. బాణ సంచాతో ప్రయోగాలు చేయొద్దని చెబుతున్నారు. బాణ సంచా కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఓ వైపు సూచనలు చేస్తున్నా.. ఈ యువకుడు చేసిన పనికి అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అయితే డిఫరెంట్ డ్రెస్సులు వేస్తూ కనిపించే ఆ యువకుడు ఇలా పటాకల డ్రెస్ వేసి అందరినీ ఆకట్టుకోవాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే దీనిని ఒక డ్రెస్సులాగా తయారు చేసి ధరించాడు. సాధారణంగా ఉర్పిజావెద్ లాంటి వాళ్తు తమ డ్రెస్సులతో ఆకట్టుకుంటారు. దీంతో తాను కూడా విభిన్న డ్రెస్సులు వేసి ఆకర్షించాలని అనుకున్నాడు. అయితే ఇలాంటి ప్రమాదకరమైన పనుల వల్ల తనకు మాత్రమే కాకుండా చుట్టుపక్కల వారికి కూడా ఇబ్బందులు ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలని కొందరు సూచిస్తున్నారు.