https://oktelugu.com/

Ram Charan : సింగర్ గా మారిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..’గేమ్ చేంజర్’ చిత్రం నుండి మరో క్రేజీ అప్డేట్!

గేమ్ చేంజర్' విషయానికి వస్తే, ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా లిరికల్ వీడియో సాంగ్స్ ని చూసిన తర్వాత ఆడియన్స్ కి వింటేజ్ శంకర్ మార్క్ కనిపించింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 2, 2024 / 02:50 PM IST

    Ram Charan

    Follow us on

    Ram Charan : చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, నేడు గ్లోబల్ స్టార్ గా ఎదిగి, తండ్రిని మించిన తనయుడిగా రామ్ చరణ్ అందుకుంటున్న విజయాలను మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఆయన సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో చేసిన ‘గేమ్ చేంజర్’ చిత్రం విడుదల కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు తో పాటు, హిందీ, తమిళంలో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా ఈ నెల 9వ తారీఖున రాబోతుంది. ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ సింగర్ గా మారిపోయాడని ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక వార్త తెగ తిరుగుతుంది. అంటే రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రంలో పాట పాడబోతున్నాడా అంటే పప్పులో కాలేసినట్టే.

    ఆయన గతంలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీ కోసం, ఒక ప్రచార గీతాన్ని ఆలపించాడు. దీనిని గుర్తు చేసుకుంటూ అభిమానులు సోషల్ మీడియా లో ఆ పాత వీడియో ని అప్లోడ్ చేయగా అది తెగ వైరల్ గా మారింది. మణిశర్మ కంపోజ్ చేసిన ఈ పాటని అప్పట్లో ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్నారు. అప్పటికి రామ్ చరణ్ కేవలం ‘చిరుత’ సినిమాని మాత్రమే విడుదల చేసి ఉన్నాడు. ‘మగధీర’ మూవీ షూటింగ్ జరుగుతున్న రోజుల్లో ఈయన పార్టీ కోసం కొన్ని ప్రాంతాల్లో అల్లు అర్జున్ తో కలిసి ప్రచారం చేసాడు. వీళ్ళ ప్రచారానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ రామ్ చరణ్ సింగింగ్ జోలికి పోలేదు. ఇక ‘గేమ్ చేంజర్’ విషయానికి వస్తే, ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా లిరికల్ వీడియో సాంగ్స్ ని చూసిన తర్వాత ఆడియన్స్ కి వింటేజ్ శంకర్ మార్క్ కనిపించింది.

    టీజర్ తర్వాత మూడవ పాట ని విడుదల చేయబోతున్నారు. ఇది రామ్ చరణ్, కైరా అద్వానీ మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ అట. ఈ పాట కోసం శంకర్ నిర్మాత దిల్ రాజు చేత 30 కోట్ల రూపాయిల ఖర్చు చేయించాడట. దీనిని బట్టి ఈ సినిమాలో పాటల పిక్చరైజేషన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో ఊహించుకోవచ్చు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో, శ్రీకాంత్, ఎస్ జె సూర్య, అంజలి, నవీన్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో రామ్ చరణ్ మూడు విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నాడు. స్టూడెంట్ గా, IAS ఆఫీసర్ గా, రాజకీయ నాయకుడిగా ఆయన ఇందులో నట విశ్వరూపం చూపించినట్టు తెలుస్తుంది. ‘రంగస్థలం’ చిత్రం తర్వాత రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ నటన ఈ చిత్రంలో చూడబోతున్నమాట.