Dolly Jain : ఇటీవల కాలంలో చీర కట్టుకోవడమంటే అదేదో పెద్ద పని అన్న ఫీలింగు వచ్చింది ఈ కాలం అమ్మాయిలకు. నిజానికి చీరకట్టులో ఉన్న అందం మరే డ్రస్లులో ఉండదనేది అక్షర సత్యం. భారతీయ సంస్కృతిలో చీరకున్న గొప్పతనం గురించి ప్రపంచం మొత్తం తెలుసు. అలాంటి చీరను కట్టడమే వృత్తిగా ఎంచుకుని రోజుకు లక్షలు సంపాదిస్తోంది ఓ మహిళ. ఒకప్పుడు చీర కట్టుకోవడాన్ని అసహ్యించుకున్న ఆమె సూపర్ స్టార్ శ్రీదేవి సలహాతో ప్రస్తుతం టాప్ శారీ డిజైనర్ గా నిలిచింది. ఆమె డాలీ జైన్. డాలీ స్టార్ హీరోయిన్లు దీపిక, అలియా నుండి నయనతార వరకు చాలా మంది పెద్ద హీరోయిన్లకు ఫంక్షన్లలో చీరలు కడుతుంది. అంబానీ ఇంట్లో పెళ్లి అయినా, సినిమా స్టార్ పెళ్లి అయినా పెళ్లికూతురికి చీర కట్టడం ఆమె పని. డాలీ చీరను 325 రకాలుగా కట్టగలదు. ఇదో ప్రపంచ రికార్డు. ఆమె పేరు మీద నమోదైంది. కేవలం 18.5 సెకన్లలో చీర కట్టి మరో ప్రపంచ రికార్డు కూడా ఉంది.
చిన్నప్పుడు డాలి జీవిత ప్రయాణం అంతా ఒడిదుడుకులతో నడిచింది. 7వ తరగతిలో కొన్ని సమస్యల కారణంగా చదువును మధ్యలోనే వదిలేసింది. ఆ తర్వాత పూర్తిగా చదువుకోలేకపోయింది. తన అన్నయ్యలు స్కూలు వెళ్తుంటే చూసి తను చదువుకోలేకపోతున్నానని బాధపడింది. యుక్తవయసు వచ్చిన తర్వాత చీరను కట్టుకోవడం అసహ్యించుకుంది. తన జీవితంలో చీరను ఇంతలా ప్రేమించగలనని తనేప్పుడు అనుకోలేదని ఓ సందర్భంలో ఆమె చెప్పుకొచ్చింది. వాళ్ల అమ్మ ఎప్పుడూ చీర కట్టుకునేది. తను 5 నిమిషాల్లోనే చీర కట్టుకునేది. తన కుటుంబం బెంగుళూరు నుండి కోల్‌కతాకు వచ్చినప్పుడు తన సర్కిల్‌లోని వ్యక్తులు సల్వార్ సూట్లు ధరించేవారు తర్వాత డాలి అమ్మ కూడా సూట్లు ధరించడం ప్రారంభించింది. చీర మాత్రమే కట్టుకోవడానికి అనుమతి ఉన్న ఇంటికి ఆమె కోడలిగా వెళ్లింది. కుర్తాలు, డెనిమ్‌లు ధరించడానికి తన కుటుంబంలో అనుమతి లేదు. ప్రారంభంలో తనకు చీర కట్టుకోవడానికి చాలా సమయం పట్టేది.
మొదట్లో చీర కట్టుకోవడానికి కొన్నిసార్లు 45 నిమిషాలు, కొన్నిసార్లు గంట సమయం పట్టేది. ఇంట్లో చీర కట్టుకోవడానికి పొద్దున్నే నిద్రలేచేది. ఎప్పుడో ఒకప్పుడు అత్తగారిని ఇంకేమైనా వేసుకోమని ఒప్పించాలని అనుకుంది కానీ కుదరలేదు. ప్రతిరోజూ చాలా చీరలు కట్టుకోవడం అలవాటు చేసుకుంది. చీర కట్టుకునే విధానం చాలా బాగుందని వాళ్ల అత్తగారు అనే సరికి దాని మీద మమకారం పుట్టింది. కానీ ఈ పనినే వృత్తిగా చేసుకుంటానని తన ఎప్పుడూ అనుకోలేదు. డాలి అమ్మానాన్న ముంబైలో ఉండేవారు. శ్రీదేవి నివసించిన భవనంలోనే వారి ఇల్లు ఉండేది. శ్రీదేవి ఒకసారి తన ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసి, భవనంలోని వారందరినీ ఆహ్వానించారు. పార్టీలో శ్రీదేవి చీరపై ఏదో పడడంతో దాన్ని సరిచేయడానికి గదిలోకి వెళ్లింది.
ఆమె డాలి వీరాభిమాని ఆ సమయంలో తనతో పాటు గదిలోకి వెళ్లింది. తను సరిచేస్తానని చెప్పింది. సెలబ్రిటీలు తరచూ తమ చీరలను సరిచేయడానికి స్టైలర్లను పెట్టుకుంటారు. కానీ ఆ సమయంలో ఆమె ఒంటరిగా ఉంది. కాబట్టి కానీ ఆ సమయంలో ఫర్వాలేదు వద్దంది. కానీ చేస్తానని డాలి పట్టుబట్టింది. చీర మొత్తం కట్టిన తర్వాత నచ్చిందని చెప్పింది. ఇప్పటి వరకు ఇంత త్వరగా చీరలు కట్టే వారిని చూడలేదని శ్రీదేవి మెచ్చుకుంది. అప్పుడు ఒక్క నిముషం ఆగి ప్రొఫెషనల్ గా ఎందుకు చేయకూడదని సలహా ఇచ్చింది. అదే ఆలోచనలో మునిగి కోల్‌కతాకు తిరిగి వచ్చిన వెంటనే తను వృతిగా చీర కట్టాలని కోరుకుంటున్నానని ఆమె తన నాన్నతో చెప్పింది. ప్రొఫెషనల్ గా మారి కట్టిన తొలి చీరకు రూ.250 తీసుకుంది. ఇది 17 ఏళ్ల క్రితం జరిగింది.
ఆమె ప్రయాణంలో చాలా పోరాడింది. ఈ పనిని అంగీకరించడానికి సమాజం సిద్ధంగా లేదు. సీఏ, సీఎస్, ఫ్యాషన్ డిజైనర్, ఇంటీరియర్ డిజైనర్ వంటి వృత్తిని సమాజం అర్థం చేసుకుంది. కానీ చీర కట్టే వృత్తి వారికి అర్థం కాలేదు. కానీ మెల్లమెల్లగా తన వృతిని పెంచుకుంటూ వచ్చింది. సెలబ్రిటీల కారవ్యాన్ లోకి వెళ్లే వరకు చేరుకుంది. భారతదేశంలో మొట్టమొదటి ప్రొఫెషనల్ డ్రేప్ ఆర్టిస్ట్ ఆమె. ఈ వృత్తిని ఇంత గొప్ప స్థాయికి తీసుకెళ్లి లిమ్కా రికార్డ్, ఇండియా రికార్డ్ , వరల్డ్ రికార్డ్ సాధించిన మొదటి ఆర్టిస్ట్ డాలినే. ప్రపంచంలోనే. 18.5 సెకన్లలో చీర కట్టి, ఒకే చీరను 325 రకాలుగా కట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
ప్రతి హీరోయిన్ తో ఆమె పనిచేసింది. సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా, నీతా అంబానీ ఇలా ప్రతి ఒక్కరికీ ఆమె చీర కట్టింది. దీపికా పదుకొణె అంటే తనకు చాలా ఇష్టమట. డాలీ తన అత్తమామల ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు చీర కట్టుకోవడం ప్రాక్టీస్ చేసేవారు. మొదట డాలీ 80 రకాలుగా చీర కట్టుకుని లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కారు. 325 రకాలుగా చీర కట్టుకోవడం నేర్చుకుని డాలీ తన రికార్డును తానే బద్దలుకొట్టింది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Dolly can tie a saree in 325 different ways and holds the world record of tying a saree in 18 5 seconds
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com