Chanakya Niti: ప్రతి ఒక్కరూ తమ జీవితంలో విజయం సాధించాలని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని భావిస్తుంటారు. అయితే అది అందరికీ సాధ్యపడదు. కొందరు మాత్రమే జీవితంలో సక్సెస్ ను అందుకుంటారన్న సంగతి తెలిసిందే. మరికొందరు తెలిసి, తెలియకుండా చేసిన తప్పుల కారణంగా విజయాన్ని అందుకోలేరు..అటువంటి వారి కోసం ఆధ్యాత్మిక వేత్త, మేధావి ఆచార్య చాణక్యుడు కొన్ని విషయాలను వెల్లడించారు.
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాలను గురించి తెలిపారు. ఇందులో ప్రధానంగా ప్రతి మనిషి తన జీవితాన్ని ఏ విధంగా గడపాలి? జీవితంలో విజయం సాధించాలి అంటే ఏం చెయ్యాలి? ఏం చేయకూడదు? ఇలా ప్రతి అంశాన్ని వివరించారు.
ఎవరైనా ఒక వ్యక్తి చేసే తప్పు వలన తమ జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. తెలియక చేసినా సరే అది జీవితాన్ని నాశనం చేస్తుందని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో తెలిపారు. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి చేసే తప్పు ఏంటంటే తన మనసుపై నియంత్రణ లేకపోవడమని చెబుతున్నారు. దాని వలనే ఇబ్బందులు, సమస్యలతో పాటు చివరకు లైఫ్ నాశనం అయ్యే పరిస్థితులు వస్తాయని తెలియజేశారు.
సాధారణంగా ఎవరైనా మనసుపై నియంత్రణ లేకపోతే దేనిపై ధ్యాస పెట్టలేరు. అలాగే ఏ పని చేయలేరు. అటువంటి వారు ఎంత మేధావులు అయినా అవి వ్యర్థమేనని చెప్పుకోవచ్చు. తమ మనసును స్థిరంగా ఉంచుకోలేకపోవడం వలన తన సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేరు. ఈ కారణంగానే ఏ పని చేసినా ఫలితం ఉండదని చాణక్యుడు పేర్కొన్నారు.
మనసుపై నియంత్రణ లేని వ్యక్తుల కారణంగా కుటుంబంలో సమస్యలతో పాటు ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఇటువంటి వారి వలన వారి జీవితమే కాకుండా ఇతరుల జీవితాలు కూడా ప్రభావితం కావడం,ఇబ్బందులకు గురికావడం వంటి పరిస్థితులు తలెత్తుతాయని ఆచార్య చాణక్యుడు వెల్లడించారు. ఈ విధంగానే తమ మనసును నియంత్రణలో ఉంచుకోకపోవడం వలన జీవితాన్ని చేతులారా తానే నాశనం చేసుకుంటారని, అందుకే ఈ తప్పు అసలు చేయకూడదని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరికి మనసుపై నియంత్రణ చాలా ముఖ్యమని, అప్పుడే జీవితం బాగుంటుందని సూచించారు.