Homeలైఫ్ స్టైల్Washing machine safety tips: వాషింగ్ మెషీన్ వాడేటప్పుడు ఇలా చేస్తే ప్రమాదం..

Washing machine safety tips: వాషింగ్ మెషీన్ వాడేటప్పుడు ఇలా చేస్తే ప్రమాదం..

Washing machine safety tips: దుస్తులు శుభ్రం చేసుకోవడానికి చాలా మంది వాషింగ్ మెషిన్ యూజ్ చేస్తారు. అయితే కొన్నిసార్లు వీటిని వాడే విషయంల అవగాహన లేకపోవడంతో ప్రమాదాల్లో చిక్కుకుంటారు. వాషింగ్ మెషిన్ వాడే సమయంలో విద్యుత్ కేర్ తప్పనిసరిగా తీసుకోవాలని కొందరుచెబుతున్నారు. ముఖ్యంగా వాషింగ్ మెషీన్ ఆన్‌లో ఉన్నప్పుడు స్నానం చేయకూడదని ఎలక్ట్రికల్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాత్రూం దగ్గర లేదా తడి ప్రదేశాల్లో వాషింగ్ మెషీన్ ఉంచే ఇళ్లలో ఈ జాగ్రత్త చాలా అవసరం. ఎందుకంటే విద్యుత్‌తో పనిచేసే యంత్రం, నీరు, తడి వాతావరణం ఈ మూడు కలిస్తే ప్రమాదం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది.

వాషింగ్ మెషీన్ పనిచేస్తున్నప్పుడు మోటార్, హీటర్, వైరింగ్‌పై నిరంతర ఒత్తిడి ఉంటుంది. ఈ సమయంలో లోపలి వైర్లలో చిన్నపాటి లీకేజీ వచ్చినా అది మెషీన్ బాడీకి చేరవచ్చు. సాధారణంగా సరైన ఎర్తింగ్ ఉంటే ప్రమాదం తగ్గుతుంది. కానీ ఎర్తింగ్ సరిగా లేకపోతే మెషీన్ తాకినప్పుడు షాక్ తగిలే అవకాశం ఉంటుంది. స్నానం చేస్తున్నప్పుడు ఆ ప్రాంతం అంతా తడిగా ఉంటుంది. తడి నేలపై నిలబడి ఉండగా మన శరీరం విద్యుత్‌ను వేగంగా ప్రసారం చేస్తుంది. బాత్రూం, షవర్, నీటి పైపులు తడిగా ఉండటం వల్ల లీకేజీ కరెంట్ త్వరగా శరీరానికి చేరే అవకాశం ఉంటుంది. కొన్ని ఇళ్లలో వాషింగ్ మెషీన్ డ్రైనేజ్ పైప్, బాత్రూం వేస్ట్ పైప్ ఒకే లైన్‌కు కనెక్ట్ అయి ఉండటం వల్ల కూడా ప్రమాదం పెరుగుతుంది.

మెషీన్ నడిచే సమయంల స్పిన్ మోడ్‌లో ఉన్నప్పుడు ఎక్కువ వైబ్రేషన్ వస్తుంది. దీని వల్ల ప్లగ్ సడలడం, వైరింగ్ దెబ్బతినడం, పాత కనెక్షన్లు లూజ్ కావడం జరగొచ్చు. ముఖ్యంగా పాత మెషీన్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందువల్ల ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాషింగ్ మెషీన్‌కు తప్పనిసరిగా సరైన ఎర్తింగ్ ఉండాలి. తడి చేతులతో ప్లగ్ తాకకూడదు. మెషీన్ నడుస్తున్నప్పుడు బాత్రూంలో స్నానం చేయకపోవడం మంచిది. పని పూర్తయ్యాక ప్లగ్ ఆఫ్ చేయాలి. పాత వైరింగ్ ఉంటే ఎలక్ట్రిషియన్‌తో చెక్ చేయించాలి. ELCB/RCCB సేఫ్టీ స్విచ్ ఉంటే ప్రమాదం చాలా తగ్గుతుంది.

మెషీన్ ఆఫ్ చేసిన వెంటనే కాకుండా కొన్ని నిమిషాలు గ్యాప్ ఇవ్వడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా స్పిన్ పూర్తై పవర్ పూర్తిగా ఆఫ్ అయిన తర్వాత మాత్రమే బాత్రూం ఉపయోగించడం సురక్షితం. ఇప్పటి ఆధునిక మెషీన్లలో సేఫ్టీ ఫీచర్లు ఉన్నా, పాత ఇళ్లలో ఎర్తింగ్ లోపాలు, తడి గోడలు, నాసిరకం ప్లగ్‌లు ప్రమాదానికి కారణమవుతాయి. అందుకే “జాగ్రత్తే రక్షణ” అనే విధంగా వ్యవహరించడం ఉత్తమం.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version