Partner : ఒకప్పుడు ప్రేమకు చాలా విలువ ఉండేది. కానీ ఇప్పుడు టైమ్ పాస్, అట్రాక్షన్ లకు కూడా కొందరు ప్రేమ అనే పేరే పెడుతున్నారు. ఇక ప్రస్తుతం ట్రెండ్ మారుతుంది. డేటింగ్స్ తో రోజులు గడుపుతూ భాగస్వాములను కూడ కొందరు మోసం చేస్తున్నారు. ప్రస్తుతం మైక్రో – మాన్స్ (micro – mance) ట్రెండ్ వైరల్ అవుతుంది. ఈ ట్రెండ్ ద్వారా భాగస్వామిని సంతోషంగా చూసుకోవచ్చు. దీని ద్వారా చిన్న చిన్న పనులు చేసి మీ భాగస్వామి పట్ల ప్రేమ చూపించవచ్చు అంటున్నారు నిపుణులు. ఇంతకీ మైక్రో మాన్స్ ట్రెండ్ అంటే ఏంటి..? దీని వల్ల భాగస్వాములు ఎలా సంతోషంగా ఉంటారో చూసేద్దాం.
మైక్రో మాన్స్ చాలా భిన్నమైన ప్రక్రియ. అయితే దీని ద్వారా పెద్దగా ప్రేమను వ్యక్తపర్చాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పనులతోనే భాగస్వామిని సంతోషంగా చూసుకునే అవకాశం ఉంటుంది. ఇక సరళంగా చెప్పాలంటే, మైక్రో – మాన్స్ అంటే మీ భాగస్వామిని సంతోషపెట్టడానికి చిన్న చిన్న మార్గాలను ఎంచుకోవడం అని అర్థం. అంటే ఓ అందమైన కవిత రాయడం, వారికి ఇష్టమైన భోజనం తయారు చేయడం ఒక మంచి హగ్ ఇవ్వడం వంటి పనులు అన్నమాట. ఇలా చేయడం వల్ల వారిపై మీకు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకుంటారు మీ పార్టనర్.
ప్రతి ఒక్కరు బిజీ లైఫ్ ను లీడ్ చేస్తూ పార్టనర్ కు సమయం ఇవ్వడం లేదు. ముఖ్యంగా మీ భాగస్వామికి కాస్త సమయం ఇవ్వాలి. భాగస్వామి కోసం ఓ ప్రేమ కవిత రాయండి. కుదిరితే రొమాంటిక్ పాటల్ని ఓ ప్లే లిస్టులా తయారు చేసి పంపండి. ఇంట్లో ఉన్న సమయంలో వారికి ఇష్టమైన వంటం చేయండి. కుదిరితే షాపింగ్‌కి తీసుకువెళ్లండి. చిన్న చిన్న గిఫ్టులను ఇవ్వండి. వీటిని చేయడం అంటే మీరు మైక్రో మాన్స్ ను ప్లాన్ చేస్తున్నట్టే. ఇలా చేస్తే మీరు ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు.
ఈ మైక్రో-మాన్స్ వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు తగ్గి ప్రేమ పెరుగుతుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ప్రేమించుకుంటారు. గొడవలు జరిగినా.. మీ మధ్య దూరం మాత్రం పెరగదు. భాగస్వామి పట్ల శ్రద్ధ ఉందని తెలపడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. భాగస్వామిని సంతోషపెట్టడానికి పెద్ద పెద్ద పనులు చేయడం ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చిన్న చిన్న పనులు కూడా పెద్ద రిజల్ట్ ను ఇస్తాయి. అందుకే మైక్రో-మాన్స్‌ని జీవితంలో భాగం చేసుకోవాలి.
ఇందులో భాగంగా థ్యాంక్స్ కూడా అప్పుడప్పుడు చెబుతూ ఉండండి. చిన్న విషయాలకు కూడా మీ పార్టనర్ కు థాంక్స్ చెప్పడంలో తప్పేం లేదు. భార్య చేసిన వంట బాగుంటే థ్యాంక్స్ అనండి. ఇక భర్త ఏదైనా పనిలో సాయం చేస్తే భార్య కూడా థాంక్య్ అంటే సరిపోతుంది. దీని వల్ల మీ మధ్య ప్రేమ ఏర్పడుతుంది. కొన్ని సార్లు సర్పైజ్ లు, క్యాండిల్ లైట్ డిన్నర్ లు, పూలతో గదిని అలంకరించడం, సినిమాలకు వెళ్లడం, చిన్న ట్రిప్ లు వంటివి మీ రిలేషన్ ను చాలా స్ట్రాంగ్ గా చేస్తాయి.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Does your partner take you lightly if you want to turn around while holding the horn do this
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com