Heart Attack: ఇప్పటి రోజుల్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది గుండె నొప్పుల బారిన పడుతున్నారు. ప్రాణాలను చాలా వరకూ రిస్క్ లో పెట్టుకుంటున్నారు. దీనికి అనేక కారణాలున్నాయి. అయితే గుండె పోటు వచ్చే ముందు మాత్రం మన శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అంతేకాదు కొన్ని సంకేతాలు సంకేతాలు కనిపిస్తాయి. అంతే కానీ సినిమాల్లో చూపినట్టుగా ఒక్కసారిగా నేలమీద పడిపోవడం మాత్రమే కనిపించదు. ముందుగానే చాలా సంకేతాలు వస్తాయి వాటిని బట్టి గుండెపోటు రాబోతుందని అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఇదిలా ఉంటే గుండె పోటు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నా మధుమేహం కూడా ఒక కారణం అంటున్నారు నిపుణులు.
మధుమేహం సపరేట్ సమస్య కదా.. గుండెపోటుకు ఈ వ్యాధి ఎలా కారణం అవుతుంది అనుకుంటున్నారా? కానీ అవుతుందట. గుండెజబ్బుకు పొగ తాగటం, అధిక రక్తపోటు, ఊబకాయం మాత్రమే ముప్పు కాదని. మలబద్ధకమూ కారణం అవుతుంది అనే ఆశ్చర్యకరమైన తాజా అధ్యయనం తెలుపుతుంది. గుండెపోటు, గుండె వైఫల్యం వంటి తీవ్ర సమస్యలకూ మలబద్ధకానికీ సంబంధం ఉంటున్నట్టు తెలిపారు పరిశోధకులు.
మలబద్ధకం చాలామందిలో ఉండే కామన్ సమస్య. దీన్ని పెద్ద సమస్యగా భావించరు చాలా మంది. కానీ ఇది గుండెజబ్బుకు దోహదం చేస్తుందని ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ అధ్యయనం పేర్కొంటోంది. ఇందులో 4లక్షలకు పైగా మందిని పరిశీలిస్తే..ఇందులో 23,814 మంది మలబద్ధకం ఉన్నవార ఉన్నారట. మలబద్ధకం లేనివారితో పోలిస్తే ఉన్నవారికి గుండెజబ్బు వచ్చే అవకాశం రెట్టింపవుతున్నట్టు గుర్తించారు. అధిక రక్తపోటు ఉన్నవారికి ఈ ముప్పు ఇంకా ఎక్కువగా ఉందట.
అధిక రక్తపోటుతో ముడిపడిన గుండెజబ్బు ముప్పులను మలబద్ధకం మరింత ఎక్కువ చేసిందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఫ్రాన్సిన్ మార్క్వెస్ తెలిపారు. గుండెజబ్బు, మలబద్ధకం మధ్య జన్యుపరమైన సంబంధాలు కూడా ఉన్నాయట. పేగు, గుండె ఆరోగ్యాలను కలిపే యంత్రాంగాల మీద చేసిన పరిశోధనలు కొత్త ద్వారాలు తెరిచాయని పేర్కొన్నారు. గుండెజబ్బు నివారణ, నియంత్రణకు పేగుల ఆరోగ్యం మీద దృష్టి సారించాల్సిందే అన్నారు.అయితే చాలామంది రోజూ విరేచనం కాకపోతే మలబద్ధకం అనుకుంటారు. నిజానికి మూడు రోజులకు ఒకసారి విరేచనమైనా, రోజుకు మూడు సార్లు విరేచనాలైనా మామూలుగానే పరిగణించాల్సి ఉంటుందని తెలిపారు.
గుండె పోటు వచ్చే ముందు ఉండే లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఛాతిలో బరువు గుండె మొరాయిస్తుందని చెప్పే సాధారణ సంకేతం. ఛాతిలో బిగుతు, నొప్పి ఉంటుంది. కొందరిలో గుండెపోటు వచ్చే ముందు వాంతులు, వికారం,గుండెల్లో మంట అజీర్ణం, వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండెపోటు లక్షణాల్లో శరీరం ఎడమ వైపున నొప్పి వస్తుంది. ఛాతీలో మొదలయ్యి ఎడమ భాగంలో చేయి, కాలు లాగడం వంటి సమస్య వస్తుంది. తలతిరుగుతున్నట్టు, ముఖం ఇసురుతున్నట్టుగా కూడా కొందరిలో అనిపిస్తుంది. ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి… శరీరం బ్యాలెన్స్ కోల్పోవడం, స్వాధీనం తప్పడం, శ్వాసలో ఇబ్బంది కలగడం, రక్తపోటు పడిపోవడం వంటి ఏ లక్షణాలు ఉన్నా సరే వెంటనే వైద్యులను సంప్రదించాలి.