https://oktelugu.com/

Helmet Blow Your Hair: హెల్మెట్ ధరిస్తే జుట్టు ఊడుతుందా? మరేం చేయాలి?

వాతావరణ కాలుష్యం, కలుషిత నీటి వల్ల నేటి కాలంలో అనేక అనారోగ్యాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో శరీంలోనే కాకుకండా స్కిన్ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. వీటిలో జుట్టు రాలడం ఒకటి. ఒక మనిషి అందంగా కనిపంచడానికి సరైన జుట్టు అవసరం

Written By:
  • Srinivas
  • , Updated On : November 8, 2024 / 10:54 AM IST

    Helmet-Blow-Your-Hair

    Follow us on

    Helmet Blow Your Hair: వాతావరణ కాలుష్యం, కలుషిత నీటి వల్ల నేటి కాలంలో అనేక అనారోగ్యాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో శరీంలోనే కాకుకండా స్కిన్ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. వీటిలో జుట్టు రాలడం ఒకటి. ఒక మనిషి అందంగా కనిపంచడానికి సరైన జుట్టు అవసరం. ఈ జుట్టు వయసు మల్లిన తరువాత రాలిపోతూ ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలిపోతుంది. చిన్న వయసులోనే చాలా మందికి బట్ట తల వస్తున్న దృశ్యాలు ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు భయపడని రకరకాల క్రిములు వాడుతున్నారు. మరికొందరు హెయిర్ ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు. అయితే కొందరికి సహజసిద్ధంగా కాకుండా కొన్ని చర్యల వల్ల జుట్టు ఊడిపోతుంది. తాజాగా వినిపిస్తున్న ప్రకారం.. హెల్మెట్ ధరిస్తే జుట్టు ఊడిపోతుందని అంటున్నారు. అదెలాగంటే?

    వాహనాలపై ప్రయాణం చేసేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎటువంటి ప్రమాదాలు ఎదురవుతున్నాయో చూస్తున్నాం. అయితే వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు హెల్మెట్ ధరించని వారికి పోలీసులు జరిమానా విధిస్తున్నారు. అయినా కొందరు హెల్మెట్ ధరించడం లేదు. తాజాగా కొందరు వైద్యులు చెబుతున్న ప్రకారం హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు ఊడిపోతుందని అంటున్నారు. కొందరు బైక్ పై ఎక్కువ దూరం ప్రయాణం చేసేవారు… ప్రతిరోజూ హెల్మెట్ ధరించేవారిలో జుట్టు ఊడిపోయే సమస్య ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

    హెల్మెట్ తలపై నిత్యం ఉండడం వల్ల తలలో చెమట ఎక్కువగా ఉండి వెంట్రుకలు బలహీనంగా మారుతాయి. దీంతో అవి తొందరగా ఊడిపోతాయని చెబుతున్నారు. అంతేకాకుండా హెల్మెట్ ఎక్కువగా తలపై ఉండడం వల్ల ఎండ తగలకపోవడంతో ఇన్ఫెక్షన్ కు గురై జుట్టు బలహీనంగా మారుతుందని చెబుతున్నారు. అయితే జుట్టు రాలుతుండిన హెల్మెట్ వాడకుండా ఉండడం కరెక్ట్ కాదు. ఎందుకంటే జుట్టు కంటే ప్రాణం అవసరం. మరి ఈ సమస్య నుంచి బయటపడడం ఎలా? అయితే కొన్ని టిప్స్ పాటించడం వల్ల హెల్మెట్ ధరించినా.. ఎలాంటి నష్టం ఉండదు.

    హెల్మెట్ ఎక్కువగా ధరించేవారికి తలలో చెమట వస్తుంది. ఈ క్రమంలో తలపై ఒక మొత్తటి కర్ చీప్ వేసుకోవాలి. ఆ తరువాత దానిపై హెల్మెట్ ధరించాలి. కొందరు వాహనం ఆగిన సమయంలో హెల్మెట్ తీసిన కాసేపు పక్కన ఉంచాలి. కొందరు తల స్నానం చేసిన తరువాత జుట్టు తడిగా ఉన్నా.. హెల్మెట్ ధరిస్తారు. ఇలా కాకుండా జుట్టుపూర్తిగా ఆరిన తరువాతే హెల్మెట్ ధరించాలి. కొన్ని నాసిరకం హెల్మెట్ వల్ల జుట్టు అనారోగ్యంగా మారుతుంది. అందువల్ల నాణ్యమైన బ్రాండ్ హెల్మెట్ వాడడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టోచ్చు.

    హెల్మెట్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. దీనిని ఉపయోగించప్పుడు ఎక్కువగా వెలుతురు ప్రసరించే ప్రదేశంలో ఉంచాలి. లేకుంటే ఇందులో క్రిములు దాగి ఉంటాయి. దీనిని శుభ్రం చేయకుడా ధరిస్తే అవి తలలోకి వెళ్తాయి. హెల్మెట్ లోని బ్యాక్టీరియాను తొలగించే ప్రయత్నం చేయాలి. అప్పుడే హెల్మెట్ ధరించినా ఎలాంటి నష్టం ఉండదు. పైగా ప్రాణాలను రక్సించుకోగలుగుతారు.