
Hot Water Benefits: ఇటీవల కాలంలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువవుతోంది. మారుతున్న జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే గుండె జబ్బులు వేధిస్తున్నాయి. ఫలితంగా తొంభై ఏళ్లకు రావాల్సిన గుండె జబ్బులు ముప్పయి ఏళ్లకే వస్తున్నాయి. దీంతో ఆస్పత్రుల చుట్టు తిరుగుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గుండె ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే మన ప్రాణాలకు ఆపదలు ఏర్పడవచ్చు. చెడు కొవ్వు పెరగకుండా మన ఆహార అలవాట్లు ఉండాలి. ఏది పడితే అది తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగితే అంతే సంగతి.
రక్త సరఫరా మందగిస్తే గుండె జబ్బులు వచ్చే ఆస్కారం ఉంటుంది. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. మెదడుకు రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే వీలుంటుంది. చెడు కొలెస్ట్రాల్ ను మందుల ద్వారా నియంత్రించుకోవచ్చు. వైద్యుల సలహాలు తీసుకుని చెడు కొవ్వు పెరగకుండా చూసుకోవాలి. ఈ నేపథ్యంలో వేడి నీరు కూడా కొవ్వును తగ్గిస్తుందని చెబుతున్నారు. ఉదయం పూట వేడినీరు తాగడం వల్ల మనకు ఎంతో ఉపశమనం కలుగుతుంది.
రక్తనాళాల్లో చెడు కొవ్వు లిపిడ్లు చేరడం వల్ల కొలెస్ట్రాల్ ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భంలో వేడి నీరు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వేడి నీటిని తాగడం వల్ల చెడు కొవ్వు ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇది శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. వేడి నీరు తాగడం వల్ల రక్తం వేగంగా పరుగెత్తే ఇంధనంగా మారుతుంది. రక్తం పలుచగా లేకపోతే గడ్డకడుతుంది. దీంతో రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. గుండెపోటుకు కారణమవుతుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే గోరువెచ్చని నీరు తాగితే రక్త ప్రసరణను ఉత్తేజపరుస్తుంది.

ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గించడంలో కూడా వేడినీరు ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ సమస్య ఏర్పడటానికి ప్రధాన కారణం ఆయిల్ ఫుడ్డే. సాధ్యమైనంత వరకు నూనెలో వేయించిన వాటిని తినేందుకు మొగ్గు చూపకూడదు. ట్రైగ్లిజరైడ్ ఉత్పత్తి కావడానికి నూనెతో చేసిన పదార్థాలే తోడ్పడతాయి. అందుకే వాటి నుంచి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. వేడి నీరు తాగితే ట్రైగ్లిజరైడ్ కణాలను సిరలకు అంటుకోనివ్వకుండా చేయడంలో ప్రధానంగా సాయపడుతుంది. వేడినీరు వల్ల మనకు ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉండటంతో మనం ఉదయం పూట తీసుకోవడమే మంచిది.