Food: మొగుడి మీద ప్రేమతో ఎంగిలి పల్లెంలో భోజనం చేస్తున్నారా? ఒక్క క్షణం ఆగండి..

భార్యభర్తల బంధం అన్యోన్యమైనది. ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగుపెట్టిన తరువాత భర్తే సర్వస్వం అనుకుంటుంది. ఈ తరుణంలో పురాతన కాలంలో భర్తను గౌరవించే పద్ధతులను కొన్ని పాటించారు.

Written By: Srinivas, Updated On : August 5, 2023 3:43 pm

Food

Follow us on

Food: భారతదేశంలో సాంప్రదాయాలకు నిలయం. ఇక్కడున్న సాంప్రదాయాలు మరే దేశంలో ఉండవు. ఈ తరుణంలో కొందరు సాంప్రదాయాల పేరుతో కొన్ని చేయకూడని పనులు చేస్తుంటారు. పురాతన కాలంలో పాటించిన కొన్ని పద్ధతులను ఇప్పటికీ పాటించేలా ఒత్తిడి చేస్తున్నారు. కానీ అప్పటి పరిస్థితులు, ఇప్పటి వాతావరణానికి చాలా తేడా ఉంది. అందువల్ల కాలంతో పాటు మనమూ మారాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆహారం విషయంలో కొన్ని అలవాట్లను నేటి కాలానికి అనుగుణంగా ఉండాలని కొందరు వైద్యులు చెబుతున్నారు. అందులో ఓ విషయం గురించి ప్రస్తావిస్తే..

భార్యభర్తల బంధం అన్యోన్యమైనది. ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగుపెట్టిన తరువాత భర్తే సర్వస్వం అనుకుంటుంది. ఈ తరుణంలో పురాతన కాలంలో భర్తను గౌరవించే పద్ధతులను కొన్ని పాటించారు. వీటిలో భర్త భోజం చేసిన పల్లెంలోనే భార్య తినాలని అనేవారు. అయితే కొందరు ఈ పద్ధతిని ఇప్పటికీ పాటిస్తున్నారు. భార్య భర్తలే కాకుండా కొందరు పిల్లలు విడిచిపెట్టిన ఆహారాన్ని పడేయడం ఎందులే అని మిగతా వారు తింటూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల అనర్థాలు ఎదురవుతాయని అంటున్నారు.

ఈరోజుల్లో ఎవరికి ఎలాంటి అనారోగ్యం ఉందో హాస్పిటల్ కు వెళ్లే వరకు తెలియడం లేదు. కుటుంబ సభ్యులపై ప్రేమ ఉండడం తప్పుకాదు. కానీ ఒకరికి ఏదైనా అనారోగ్యం ఉంటే అది అందరికీ రావడం వల్ల ఎక్కువగా నష్టపోతుంటారు. ముఖ్యంగా పెద్దవాల్లు కొన్ని జబ్బులను తట్టుకుంటారు. కానీ చిన్న పిల్లలు తట్టుకోలేరు. ఈ క్రమంలో ఒకరికి వచ్చిన అనారోగ్యం మిగతా వారికి రావడంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి అనారోగ్యాలు ఒకరు విడిచిపెట్టిన ఆహారాన్ని మరొకరు భుజించడం వల్ల వస్తుందని కొందరు వైద్యులు చెబుతున్నారు.

అయితే పిల్లలు, లేదా భర్త విడిచిపెట్టిన ఆహారాని ఎట్టి పరిస్థితుల్లో తినకపోవడమే మంచిదని వైద్యుులు చెబుతున్నారు. ఈ విషయంలో కొందరు పద్దతులు పాటించాలని ఒత్తిడి చేస్తే వారికి అవహన కల్పించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా జలుబు, దగ్గులాంటి ఇన్ఫెక్షన్ కు గురయ్యే వారి ఆహారం తిన్నా నిత్యం ఈ ఆనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. అందువల్ల ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు పాటిస్తే మేలని అంటున్నారు.