Lunch Sleep: మారుతున్న మన జీవనశైలితో మనకు కొన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. ఆహారం విషయంలో అయితే మరిన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మనం తీసుకునే ఆహారమే మనకు సమస్యలు సృష్టిస్తోంది. ప్రొటీన్లు లేని ఆహారం తీసుకోవడంతో అనారోగ్య సమస్యలు వేధిస్తన్నాయి. ఇరవై ఏళ్లకే మధుమేహం, రక్తపోటు వంటివి దరిచేరుతున్నాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం మనం తీసుకునే ఆహారాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులు రావడం ఖాయం. దీనికి గాను బలమైన ఆహారం తీసుకుని నష్టాలు జరగకుండా చూసుకోవాలి.

మధ్యాహ్న భోజనం విషయంలో మాత్రం ఆలోచించుకోవాలి. కడుపు నిండా భోజనం పెడితే మనకు నిద్ర రావడం సహజమే. అన్నం తింటే నిద్ర వస్తుంది. కడుపు నిండా తింటే మెలటోనిన్, సెరటోనిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మెదడును ప్రశాంతంగా ఉంచి నిద్ర వచ్చేలా చేస్తాయి. దీంతో మనకు కునుకుపాట్లు వస్తాయి. ఓ ఐదు నిమిషాలు పడుకుంటే హుషారుగా ఉంటాం. కానీ అదేపనిగా రెండు మూడు గంటలు పడుకుంటే తాబేలు, కుందేలు కథలా మారుతుంది. మనం చేసే పనులు పెండింగులో పడిపోతాయి.
అన్నంలో పిండిపదార్థాలు అధికంగా ఉండటంతో శరీరం అలసిపోయి నిద్ర ముంచుకొస్తుంది. బిర్యానీలాంటివి తింటే నిద్ర మరీ ఎక్కువవుతుంది. పగటిపూట నిద్ర రాకుండా ఉండాలంటే కార్బోహైడ్రేడ్లు తక్కువగా ఉండేవి తీసుకోవడం ఉత్తమం. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం శ్రేయస్కరం. మధ్యాహ్న భోజనంలో అన్నంకు బదులు జొన్నలు, సజ్జలు, ఓట్స్ వంటివి తీసుకుంటే ఎంతో మంచిది. మధ్యాహ్నం తిన్న వెంటనే నిద్ర వస్తే పనులు సజావుగా సాగవు. కూరగాయలు, సలాడ్లు, చికెన్, పన్నీరు వంటివి తీసుకోవడం వల్ల కూడా రక్తంలో చక్కెర ఒకసారి విడుదల కాదు. దీంతో బద్ధకం ఆవహించదు నిద్ర అసలే రాదు.

మధ్యాహ్నం పూట తిన్నాక కాసేపు అటు ఇటూ తిరగాలి. అలా చేస్తే మనం తిన్నది తొందరగా జీర్ణం అవుతుంది. కడుపు నిండుగా ఉండే ఫీలింగ్ పోతుంది. సింపుల్ చిట్కాలు తీసుకుని మధ్యాహ్నం భోజనం ముగిస్తే ఇబ్బందులు ఏర్పడవు. కడుపు నిండా తింటే కష్టమే. ఆవలింతలు, నిద్ర మత్తు వస్తే పనులు చేయడానికి కష్టమవుతుంది. భుక్తాయాసం ఉంటే నిద్ర రావడం సహజం. అందుకే మధ్యాహ్నం పూట ఎక్కువగా కాకుండా మితంగా తింటేనే ప్రయోజనం. అన్నం తింటే గ్లూకోజు వెంటనే రక్తంలో చేరడం వల్ల నిద్ర మత్తు వస్తుంది. అందుకే మధ్యాహ్న భోజన విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల లాభం కలుగుతుంది.