https://oktelugu.com/

Chanakya Neeti : ఈ వ్యక్తులు ఇంటికి అతిథిగా వస్తే భారీగా నష్టం.. ఎందుకో తెలుసా?

అతిథులు దేవేళ్లతో సమానంగా భావించి వారికి సకల మర్యాదలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యం దక్కుతుందని అంటారు. కానీ కొన్ని లక్షణాలు ఉన్న వారికి ఇంటికి పిలవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఎలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులను ఇంటికి పిలవకూడదో తెలుసుకుందాం.

Written By:
  • Srinivas
  • , Updated On : October 4, 2024 / 10:35 PM IST

    Chanakya Neeti

    Follow us on

    Chanakya Neeti :  అపర చాణక్యుడు రాజనీతి శాస్త్రాన్ని బోధించి రాజ్యాన్ని సస్యశ్యామలం చేశాడు. అదే సమయంలో మానవ జీవితానికి అవసరమైన కొన్ని సూత్రాలను అందించాడు. చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలు జీవితాన్ని సక్రమ మార్గంలో పయనించేలా చేస్తాయి. అందుకే చాలా మంది వీటిని ఫాలో అవుతూ ఉంటారు. చాణక్యుడు చెప్పిన ప్రకారం కొందరిని ఇంటికి పిలవడం వల్ల తీవ్ర నష్టాలను ఎదుర్కొంటారని అంటారు. సాధారణంగా ఇంట్లో ఏదైనా శుభకార్యం నిర్వహించినా.. మిగతా సందర్భాల్లో అతిథి మర్యాదల కోసం ఇంటికి పిలుస్తూ ఉంటారు. అతిథులు దేవేళ్లతో సమానంగా భావించి వారికి సకల మర్యాదలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యం దక్కుతుందని అంటారు. కానీ కొన్ని లక్షణాలు ఉన్న వారికి ఇంటికి పిలవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఎలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులను ఇంటికి పిలవకూడదో తెలుసుకుందాం..

    మనుషులు విభిన్న రకాలుగా ఉంటారు. కొందరు మంచి వ్యక్తిత్వంతో కలిగి ఉంటే.. మరికొందరు నెగెటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు. కొందరు ఏ పని చేసినా.. దానిని విమర్శిస్తూ ఉంటారు. అలాగే తనకంటే గొప్పగా ఉన్న వారిని ఎదగకుండా చేస్తారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులతో స్నేహం చేయడమే కాకుండా వారిని ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి పిలవకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. ఇలాంటి వారు ఇంటికి రావడం వల్ల పిలిచిన వారినే వ్యతిరేకంగా భావించే అవకాశం ఉంది. దీంతో వారు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

    కొందరు ఎటువంటి వ్యక్తులను నమ్మరు. అంతేకాకుండా వరు చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆ పనుల వల్ల నష్టం కలుగుతుందని అనుకుంటే అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఆలాంటి వారిని ఏ విధంగానూ ఇంటికి పిలవకుండా జాగ్రత్తపడాలి. ఇలాంటి వారు ఇంటికి రావడం వల్ల ఏదో ఒక విషయంలో తప్పులు వెతుకుతూ ఉంటారు. దీంతో మనశ్శాంతి లేకుండా చేసి అనారోగ్యాలు తెప్పిస్తారు. అందువల్ల ఇలాంటి వ్యక్తులను ఇంటికి పిలవడం మానుకోండి.

    సమాంలో చెడ్డ వ్యక్తులు ఎవరో తెలిసిపోతుంది. అలాంటి వ్యక్తులను ఇంటికి పిలవ వద్దు. ఏ రకంగానైనా వారు ఇంట్లో సమస్యలు సృష్టించడానికి కారణమవుతారు. అంతేకాకుండా ఇంటికి పిలిచిన వారికే నష్టం కలిగిస్తూ వారి నష్టానికి కారకులవుతారు. ఇలాంటి వారి వల్ల ఎప్పుడూ నష్టమే అందువల్ల వీరిని ఇంటికి పిలవడం మానుకోండి. వీరు ఇంట్లోకి రావడం వల్ల పిలిచిన వారికి కూడా సమాజంలో గుర్తింపు పోతుంది. ఎందుకంటే వారితో స్నేహం ఉందన్న భావన ఇతరుల్లో కలిగి కొందరు వీరికి దూరమవుతారు.

    డబ్బుఆశ ఎవరికైనా ఉంటుంది. కాని అతిగా ఉండడం వల్ల జీవితంలో అన్నీ సమస్యలే ఉంటాయి. అయితే నిత్యం డబ్బుపై ప్రేమ ఉండే వ్యక్తులను ఇంటికి పిలవవద్దు. ఎందుకంటే వీరు పిలచిన వ్యక్తి ఇంట్లో డబ్బు ఎంత ఉంది?అంటూ తమతో పోల్చుకుంటారు. ఇలా వారు ఇంటికి నష్టాన్ని కలిగించే విధంగా ప్రణాళికలు సృష్టించే ప్రమాదం ఉంది. అందువల్ల డబ్బుపై అతిగా ప్రేమ ఉండే వ్యక్తులను ఇంటికి పిలవకుండా జాగ్రత్తపడాలి.