https://oktelugu.com/

Noni fruit: నోని పండు తినండి.. వంద రకాల వ్యాధులకు చెక్ పెట్టండి

ఈ నోని పండ్లలో కేలరీలు అనేవి తక్కువగా ఉంటాయి. ఇవి జీవక్రియను సంరక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే శరీరంలో ఉన్న హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో నోని పండు బాగా ఉపయోగపడుతుంది. ఈ నోని పండు జ్యూస్‌ శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది. అలాగే కండరాలు బలంగా తయారయ్యేలా కూడా చేస్తుంది.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 4, 2024 / 11:01 PM IST

    Noni-fruit

    Follow us on

    Noni fruit: ఆరోగ్యంగా ఉండాలని ఎక్కువ శాతం మంది పండ్లు తింటారు. అయితే మనలో చాలామందికి కొన్ని పండ్లు గురించి పెద్దగా తెలియదు. అలాంటి వాటిలో నోని పండు ఒకటి. దీనిని వామిట్ ఫ్రూట్ లేదా తొగరు పండు అని కూడా అంటారు. చూడటానికి బంగాళదుంప షేప్‌లో ఉండే ఈ పండు పసుపు, లేత ఆకుపచ్చ రంగులో ఉండి లోపల చిన్న గింజలు ఉంటాయి. ఈ పండులో విటమిన్‌ సి, విటమిన్ ఇ, ఫోలేట్, బయోటిన్, యాంటీఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉన్నాయి. అరుదుగా దొరికే ఈ పండులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకోవాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

    జీవక్రియ ఆరోగ్యం
    ఈ నోని పండ్లలో కేలరీలు అనేవి తక్కువగా ఉంటాయి. ఇవి జీవక్రియను సంరక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే శరీరంలో ఉన్న హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో నోని పండు బాగా ఉపయోగపడుతుంది. ఈ నోని పండు జ్యూస్‌ శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది. అలాగే కండరాలు బలంగా తయారయ్యేలా కూడా చేస్తుంది.

    కీళ్ల నొప్పులు
    కొందరు ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి కీళ్ల నొప్పుల సమస్యలతో ఇబ్బంది పడతారు. అలాంటివారికి ఈ నోని పండు జ్యూస్ బాగా పనిచేస్తుంది. రోజుకి రెండు గ్లాసుల నోని పండు జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీర వాపును తగ్గించడంలో సహాయం చేస్తుంది.

    గుండె ఆరోగ్యం
    ఈ పండ్లలో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇవి అధిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు రక్తపోటును కంట్రోల్‌లో ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే రక్త నాళాలు, రక్త ప్రసరణను ఆరోగ్యంగా సాయపడుతుంది. నోని పండు జ్యాస్‌ రక్తంలో మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచుతాయి. అలాగే గుండె ఆరోగ్యంగా ఉండేలా చూడటంతో పాటు గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది.

    రోగనిరోధక శక్తి పెరుగుతుంది
    ఈ పండులో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. అలాగే ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడటంతో పాటు జ్వరం, జలుబు, దగ్గు వంటివి రాకుండా చేస్తుంది. అలాగే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

    చర్మ ఆరోగ్యం
    విటమిన్ సి, జింక్, బయోటిన్, కాపర్, ఫైటోన్యూట్రియెంట్స్, సెలీనియం వంటి పోషకాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా సాయపడుతుంది. ముఖ్యంగా జుట్టు పెరుగుదలను కూడా పెంచుతుంది. వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయడంతో పాటు ముఖంపై మొటిమలు, మచ్చలను నయం చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు రోజూ డైట్‌లో ఈ పండును తీసుకోవడం ఉత్తమం.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.