Eclipse Effect: ఏప్రిల్ 8వ తేదీనా ఈ తొలి సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఇది ఏప్రిల్ 8 సోమవారం రాత్రి 9.12 గంటల నుంచి అర్ధరాత్రి 1.25 గంటల వరకు ముగుస్తుంది. ఈ సూర్యగ్రహణానికి 12 గంటల ముందే సూతక్ కాలం ఆరంభం కానుంది. అంటే ఈ సమయంలో దేవాలయాలు మూసి వేస్తారు. మరి గ్రహణ సమయాల్లో గుడి తలుపులు ఎందుకు మూసివేస్తారో తెలుసా? రాహువు, కేతువులను అశుభాలకు సంకేతంగా భావిస్తారు. సూర్యుడిని రాహువు మింగినప్పుడు సూర్య గ్రహణం, చంద్రుని కేతువు మింగినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది అంటారు పండితులు.
గ్రహణాలు ఏర్పడుతున్నప్పుడు అతినీల లోహిత కిరణాలు భూమిపై పడతాయి. వీటివల్ల చెడు ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక పురాణాలు ప్రకారం ప్రతికూల శక్తులకు ఈ సమయంలో ఆలయంలోకి ప్రవేశించే శక్తి ఎక్కువగా ఉంటుంది. విగ్రహాలు ఈ సమయంలో తమ శక్తిని కోల్పోతాయట. అందుకే ఈ సమయంలో దేవాలయాల తలుపులు మూసివేస్తారు. గ్రహణాల సమయంలో సూర్య, చంద్రులు అసాధారణ ప్రతికూల శక్తులను విడుదల చేస్తారట.ఆ ప్రతికూల శక్తులు దేవాలయాల్లోకి ప్రవేశించకుండా తలుపులు మూసివేస్తారట.
అమృతం కోసం రాక్షసులు, దేవతలు క్షీర సాగర మదనం చేశారు అనే విషయం తెలిసిందే. ఈ సమయంలోనే అసురులకు అమృతం లభిస్తుంది. ఇది పసిగట్టిన శ్రీహరి మోహినీ అవతారం లోకి వెళ్లి రాక్షసుల నుంచి అమృతాన్ని మాయం చేసి దేవతలకు ఇస్తుంటాడు. ఇది కనిపెట్టిన రాహువు, కేతువులు సూర్య చంద్రుల మధ్య కూర్చుంటారట. ఈ విషయాన్ని విష్ణుమూర్తికి వివరిస్తారు సూర్యచంద్రులు. అప్పటికే రాహువు కేతువులు కంఠం వరకు అమృతం తాగుతారు. దీంతో వెంటనే విష్ణు మూర్తి వారి శిరస్సులను ఖండిస్తాడు.
అమృతం స్వీకరించడంతో రాహు, కేతువుల తల భాగం అమరత్వంతో నిండిపోతుంది. శరీరం నశించిపోతుంది. అయితే వీరి గురించి సూర్యచంద్రులే విష్ణువుకు చెప్పారు కాబట్టి రాహుకేతువులు సూర్య చంద్రులను తాత్కాలికంగా మింగేస్తారు. దీంతో సూర్య చంద్రులుగా మారిపోతారు రాహుకేతువులు. గ్రహణాల వల్ల హాని కలుగుతుందని ఈ వేళ భోజనం కూడా చేయకూడదు అంటారు.గ్రహణ వేళ తులసి ఆకులను ఆహారంలో చేర్చాలి.ఈ సమయంలో వెలువడే ప్రతికూల శక్తుల వల్ల ఆహారాలు చెడిపోతాయట. అందుకే తులసి ఆకులు వేయడం వల్ల పదార్థాలు విషంగా మారవట.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా, ప్రజల విశ్వాసాల ఆధారంగా మాత్రమే పరిగణలోకి తీసుకొని మీకు చేరుస్తున్నాం. కానీ ఈ సమాచారాన్ని మీ ఒకే తెలుగు నిర్దారించదు.