Fits Problem: ఫిట్స్ ఉన్నవారికి నోట్లో నుంచి నురగ ఎందుకు బయటకు వస్తుందో తెలుసా?

ఫిట్స్ ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవాలి. పట్టుతప్పి నేల మీద పడిపోయినప్పుడు ప్రతి ఒక్కరు టెన్షన్ అవుతుంటారు. కానీ ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి.

Written By: Suresh, Updated On : January 5, 2024 5:12 pm

Fits Problem

Follow us on

Fits Problem: ఫిట్స్.. ఈ వ్యాధి ఉన్నవారితో నిత్యం జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యాధి ఎప్పుడు ఎక్కడ ఎలా ఎటాక్ అవుతుందో చెప్పడం కష్టమే. సడన్ గా వచ్చే ఫిట్స్ వల్ల అలర్ట్ గా ఉంటేనే సాధ్యమైనంత వరకు ప్రాణాలను కాపాడవచ్చు. అయితే నరాల వీక్నెస్ ఉన్నవారు ఎక్కువగా ఫిట్స్ కు లోనవుతూ ఉంటారు. ఆ సమయంలో స్పృహ ఉండదు. పట్టు తప్పి నేలపై పడిపోతుంటారు. ఇక ఈ వ్యాధి వచ్చినప్పుడు కనిపించే మరో సాధారణ లక్షణం నోటిలో నురగ వస్తుంటుంది. కొంతమందిలో ఫిట్స్ ఎప్పుడు వస్తుంటుంది. కొందరిలో అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటుంది.

ఫిట్స్ ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవాలి. పట్టుతప్పి నేల మీద పడిపోయినప్పుడు ప్రతి ఒక్కరు టెన్షన్ అవుతుంటారు. కానీ ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి. అయితే నోట్లో నుంచి నురగ కూడా వస్తుంటుంది. దాన్ని చూసి కంగారు పడవద్దు. కానీ ఇది ఎందుకు వస్తుందో తెలుసుకోండి. ఈ నురగ నోటి నుంచి కడుపులోకి వెళ్తుంటుంది. గుటక వేసినప్పుడల్లా ఈ నురగ కడుపులోకి వెళ్లడం నిరంతరం జరుగుతుంటుంది. అయితే ఫిట్స్ వచ్చినప్పుడు మనుషులు గుటక వేయరు. ఫలితంగా లాలాజలం మొత్తం బయటకు గురక రూపంలో వస్తుంటుంది.

ఊపిరితిత్తుల నుంచి కూడా గాలి నోటి ద్వారా బయటకు వస్తుంది. ఒకేసారి లాలాజలం, గాలి కలిసి రావడంతో నురగ ఏర్పడుతుంది. ఇది చాలా చిన్న కారణం. ఇది ప్రమాదకరం కాదని తెలుసుకోండి. కానీ ఫిట్స్ వచ్చినప్పుడు మాత్రం సాధ్యమైనంత త్వరగా రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లాలి. సరైన సమయానికి చికిత్స మాత్రం అవసరం అని గుర్తు పెట్టుకోవాలి. ఈ ఫిట్స్ ను మూర్య వ్యాధి అని కూడా అంటారు. వైద్య భాషలో ఎపిలెప్సీ, సైజుర్స్ అంటారు. ఇక దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మీ శరీరంలో చక్కెర శాతం లేదా సోడియం శాతంలో హెచ్చుతగ్గులు, తలకు గాయం, మెదడులో కణితి, అల్జీమర్స్ వ్యాధి, నరాల సంబంధిత సమస్యలు ఉన్నా కూడా ఫిట్స్ వస్తాయి.