Mosquito Bite Reason: దోమ ఎంత చిన్నగా ఉన్నా అది పుట్టించే ఉత్పాతం మామూలుది కాదు. దోమ కాటుతో వచ్చే మలేరియా, డెంగీ వంటి రోగాలు వస్తే మరణమే శరణం. ఇలా దోమ ఎంత చిన్నదైనా దాని వల్ల మనకు నష్టమే. ఏనుగు ఎంత పెద్దగా ఉంటుంది. కానీ దాని తొండంలోకి దోమ వెళితే తట్టుకోలేదట. అంతటి భయంకరమైన దోమలతో మనుషులకు ఎంతో నష్టమే. దోమకాటుతో మనుషుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుంది. దోమల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అవసరమైతే దోమతెరలు వాడాలని సూచిస్తున్నారు.

దోమలు కొంతమందిని ఎందుకు టార్గెట్ చేసుకుంటాయి? వారి చుట్టే ఎందుకు తిరుగుతుంటాయి? దోమలు ఎందుకు ఇలా చేస్తుంటాయనే దానిపై పరిశోధనలు కూడా చేపడుతున్నారు. జన్యువుల వల్ల అలా జరుగుతుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. చర్మంపై సహజంగా లభించే యాసిడ్ల మిశ్రమం వల్ల వచ్చే వాసనను వెదజల్లుతున్న వ్యక్తుల పట్ల దోమలు ఆకర్షితులవుతాయని రాక్ ఫెల్లర్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు తేల్చారు. ఎల్లో ఫివర్, డెంగ్యూ, జికా వంటి వైరస్ లకు కారణమయ్యే ఈడిన్ ఈజిప్టి అనే దోమపై అధ్యయనం చేశారు.
ముంజేతి వాసన నమూనాలను ఉపయోగించి 2330 కంటే ఎక్కువ పరీక్షలు నిర్వహించారు. దోమల ద్వారా సోకిన వ్యక్తుల కంటే వారి చర్మం నుంచి కార్బాక్సిలిడ్ యాసిడ్స్ అధిక స్థాయిలు స్రవిస్తాయి. మలేరియా సోకిన వ్యక్తులు దోమలకు ఆకర్షణీయంగా కనిపిస్తాయని చెబుతున్నారు. మలేరియా సోకిన వ్యక్తిని దోమలు కుట్టడానికి కారణమవుతున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దోమలు కుట్టడనికి ఇదే ప్రధాన కారణంగా చెబుతున్నారు. చర్మం రసాయన కూర్పును ప్రభావితం చేస్తుంది.

దోమల కాటు వల్ల అనేక రోగాలు విజృంభిస్తున్నాయని చెబుతున్నారు. దోమల వల్ల మనకు ఎన్నో అనర్థాలు రావడం ఖాయమే. రోగాల బారిన పడితే ప్రాణాలకే ప్రమాదం. డెంగీతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దోమ కాటుకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. దోమ కాటుతో రోగాల బారిన పడితే బతుకు దుర్భరమే. ఈ క్రమంలో దోమల నుంచి వచ్చే అనర్థాలను ముందే గమనించి వాటి బారిన పడకుండా అప్రమత్తంగా ఉంటేనే మనకు రక్షణ అనే విషయం గుర్తుంచుకోవాలి.