Unstoppable Season 2 Episode 3 Promo: బాలయ్య బాబు వ్యాఖ్యాతగా ఆహ మీడియా లో చేసిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ సీజన్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..మొదటి సీజన్ ఎంత హిట్ అయ్యిందో..రెండవ సీజన్ అంతకు మించి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది..ఇప్పటి వరుకు రెండవ సీజన్ లో రెండు ఎపిసోడ్స్ జరిగితే..రెండిటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..మొదటి సీజన్ కి బాలయ్య బాబు బావ నారా చంద్ర బాబు నాయుడు మరియు లోకేష్ హాజరైతే.

రెండవ ఎపిసోడ్ కి యంగ్ హీరోస్ విశ్వక్ సేన్ మరియు సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారు..ఈ రెండు ఎపిసోడ్స్ కి అపూర్వమైన రెస్పాన్స్ వచ్చింది..ఇక మూడవ ఎపిసోడ్ కి గత వారం కాస్త బ్రేక్ పడింది..బాలయ్య బాబు కి సినిమా షూటింగ్ ఉండడం వల్ల మూడవ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ గత వారం చెయ్యలేదు..దాని బదులు సెన్సార్ చెయ్యని మొదటి ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేసారు..ఇక ఈ వారం మూడవ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది..ఈ ఎపిసోడ్ కి గెస్ట్స్ గా శర్వానంద్ మరియు అడవి శేష్ హాజరయ్యారు.
ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చెయ్యగా దానికి సోషల్ మీడియా లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఈ ప్రోమో లో ముందుగా శర్వానంద్ మరియు అడవి శేష్ బాలయ్య కాళ్ళకి దండం పెట్టగా అప్పుడు బాలయ్య బాబు మాట్లాడుతూ ‘చిన్నపిల్లలు దేవుళ్లతో సమానం అలా కాళ్ళ మీద పడిపోకూడదు’ అని అడవి శేష్ తో అంటాడు..అప్పుడు అడవి శేష్ దానికి సమాధానం చెప్తూ ‘పెద్దవాళ్ళు దేవుళ్లతో సమానం అని విన్నాను’ అంటాడు.

అప్పుడు శర్వానంద్ మధ్యలో మాట్లాడుతూ ‘హిస్ నేమ్ ఈజ్ బాలయ్య..హి ఈజ్ స్టిల్ బాల’ అని అంటాడు..ఇక ఆ తర్వాత బాలయ్య బాబు శర్వా తో మాట్లాడుతూ ‘నీ ఫోన్ లో ఎన్ని బిట్లు ఉంటాయి అమ్మా’ అని అడుగుతాడు..అప్పుడు శర్వా బాలయ్య బాబు కౌంటర్ ప్రశ్న వేస్తూ, ‘మీరు దాదాపుగా వంద సినిమాలు పైగా చేసి ఉంటారు కదా..కనీసం 25 మంది హీరోయిన్స్ తో అయినా చేసి ఉంటారా’ అని అడుగుతాడు.
అప్పుడు అడవి శేష్ షాక్ కి గురై ‘చేసి ఉంటారా’ అని అడుగుతాడు..’అదేరా..యాక్టింగ్ చేసి ఉంటారు కదా’ అని కవర్ చేస్తాడు శర్వానంద్..అప్పుడు బాలయ్య బాబు ‘ఇవన్నీ బీ సెంటర్ తెలివితేటలు’ అని కౌంటర్ ఇస్తాడు..అలా మొత్తం అన్ లిమిటెడ్ ఫన్ తో సాగిపోయిన ఈ ఎపిసోడ్ శుక్రవారం రోజు టెలికాస్ట్ కానుంది.
https://www.youtube.com/watch?v=B2725SG0m6U&t=176s