Train Missing: మనం జీవితంలో ఎప్పుకో ఒకప్పుడు రైలు ప్రయాణం చేస్తుంటాం. దీంతో రిజర్వేషన్ చేయించుకుంటాం. కానీ అనివార్య కారణాల వల్ల మనం ఎక్కాల్సిన రైలు మిస్సయితే మన రిజర్వేషన్ టికెట్ ఏం చేయాలి? అనే ప్రశ్న చాలా మందికి రావడం సహజమే. మనం రిజర్వేషన్ చేసుకున్న సీటు తమకే ఇస్తారా? లేక ఎవరికైనా కేటాయిస్తారా? అనే అనుమానాలు రావడం కామన్.
దేశంలో రోజు లక్షల మంది రైలు ప్రయాణాలు చేస్తుంటారు. చివరి క్షణంలో రైలు మిస్సయితే మనం బుక్ చేసుకున్న సీటు ఎవరికి ఇస్తారు. రైలు మిస్సయినప్పుడు ఆ సీటును ఇంకో ప్రయాణికుడికి ఇస్తారు. మనం రిజర్వేషన్ చేయించుకున్న తరువాత వేరే స్టేషన్ లో ట్రెయిన్ ఎక్కడం వీలయితే ఆ సీటు వాళ్లకే ఉంటుంది. లేదంటే టికెట్ ఎగ్జామినర్ ఆ సీటును వేరే ప్రయాణికుడికి కేటాయించవచ్చు.
సీటు రిజర్వు చేసుకున్న వ్యక్తి తరువాత స్టేషన్ లో ఎక్కితే అప్పటికి ఆ వ్యక్తి ఆ సీటులో కూర్చోవచ్చు. ఒకసారి టికెట్ ఖరారయ్యాక సీటు తరువాత వచ్చే రెండు స్టేషన్ల వరకు రిజర్వ్ చేసుకున్న వ్యక్తి కోసం ఖాళీగా ఉంచుతారు. అప్పటికి ఆ వ్యక్తి రాకపోతే ఎగ్జామినర్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వారికి కేటాయిస్తారు. ఒకవేళ రిజర్వ్ చేుకుని రైలు ఎక్కకపోతే టికెట్ ధరలో సగం డబ్బులు రీయింబర్స్ మెంట్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు.
రైలు మొదలయ్యే స్టేషన్ నుంచి అది స్టార్ట్ అయిన మూడు గంటల తరువాత రిజర్వ్ చేసుకున్న టికెట్ ను రద్దు చేసుకోవచ్చు. టికెట్ డిపాజిట్ రిసిప్ట్ ని ఇచ్చి తరువాత రీయింబర్స్ మెంట్ పొందవచ్చు. టికెట్ కోసం ఖర్చు పెట్టిన దాని నుంచి సగం డబ్బు తిరిగి వస్తుంది. ఇలా రైలు ప్రయాణంలో మనకు టికెట్ తీసుకుని అనుకోని పరిస్థితుల్లో ప్రయాణం చేయకపోతే డబ్బులు సగం తిరిగి తీసుకోవచ్చు.